Saturday, September 6, 2025

కెసిఆరే సుప్రీం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ పార్టీకి అధినేత కెసిఆరే సుప్రీం అని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ తన్నీరు హరీష్‌రావు ఉద్ఘాటించారు. ఎవరి విషయంలోనైనా నిర్ణయం పార్టీదేనని,సొంత నిర్ణయాలు ఉండబోవని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయడమే తనకు కెసిఆర్ నేర్పించారని చె ప్పారు. లండన్ పర్యటనలో భాగంగా బిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ నే తలు నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంతోపాటు, ప్రవాస బిఆర్‌ఎస్ నేతలతో హరీష్‌రావు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బిఆర్‌ఎస్ పార్టీకి ఆటుపోట్లు కొత్తేమి కాదని అన్నారు. కేసులకు భయపడని చరిత్ర గులాబీ శ్రేణులదని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీకి ఎప్పటికైనా సుప్రీం కేసీఆరేనని తెలిపారు. రాష్ట్రంలో పాలనను గాలికి వదిలి రేవంత్ రెడ్డి ప్రభు త్వం కమిషన్లు, ఎంక్వైరీలతో కాలం వెళ్లదీస్తోందని ఆరోపించారు. పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనను, ప్రస్తుత కాంగ్రెస్ పాలన ను ప్రజలకు గమనిస్తున్నారని అన్నారు. కాళేశ్వరం అంటే రూ.లక్ష కోట్లు పోయాయని దుష్ప్రచారం చేస్తున్నారని మం డిపడ్డారు.

మేడిగడ్డ మూడు పిల్లర్లు కుంగితే రేవంత్‌రెడ్డి స ర్కార్ రాద్ధాంతం చేస్తోందని ధ్వజమెత్తారు. మూడు నాలుగు వందల కోట్లలో మేడిగడ్డ రిపేర్ అయిపోతుందని, కానీ కాం గ్రెస్ ప్రభుత్వ రిపేర్ చేయడం లేదని మండిపడ్డారు. కాళేశ్వ రం అంటే లక్ష లక్ష కోట్ల రూపాయలు పోయాయని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు దెబ్బ తినే విధంగా రాజకీయాలు చేయకూడదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు బారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్‌లు, 21 పంపు హౌస్‌లు, 203 కిలోమీటర్ల టన్నెలు, 1500 కిలోమీటర్స్ గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్స్ గ్రావిటీ కెనాల్ 600 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేయడం అని పేర్కొన్నారు. కాళేశ్వరంలో 141 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యం ఉందని చెప్పారు. మల్లన్న సాగర్ నుంచి మూసీకి నీళ్లు తీసుకెళ్తానని రేవంత్ రెడ్డి అన్నారని, రూ.7 వేల కోట్లతో టెండర్లు కూడా పిలిచారని అన్నారు. కాళేశ్వరం కూలిపోతే రేవంత్‌రెడ్డి మల్లన్న సాగర్ నుంచి నీళ్లను మూసీకి ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. గంధమల్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు..

దానికి ఆధారం కాళేశ్వరం.. మల్లన్న సాగరే కదా..? అని అడిగారు. కాళేశ్వరం లేకున్నా రికార్డ్ పంట పండిందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక చెరువు దగ్గర ఒక చెక్ డ్యాం కట్టారా.. ఒక ప్రాజెక్టు కట్టారా..? అని నిలదీశారు. మరి ఇంత పంట ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. పది సంవత్సరాల్లో బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన కృషి వల్ల ఇంత పంట పండిందని తెలిపారు. రికార్డ్ స్థాయిలో పంట పండడంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రభావం ఉందని, కేవలం మూడు బ్యారేజీల్లో.. ఒక్క బ్యారేజీలో మాత్రమే మూడు పిల్లర్లు కుంగాయని చెప్పారు. శాసనమండలిలో ఎంఎల్‌సి కోదండరాం.. అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టు గురించి ప్రశ్న అడిగితే.. అవి బాగానే ఉన్నాయని, ఎలాంటి ఇబ్బంది లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి జవాబు ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టి, ఆ పార్టీ హయాంలోనే కూలిన కడెం, ఎల్లంపల్లి, పెద్దవాగు ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి..? అని ప్రశ్నించారు. తెలంగాణలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని, ఏ శాఖలో చూసినా అవినీతి పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని హరీష్‌రావు అన్నారు.

పాలకులే నెగెటివ్ మైండ్ సెట్‌తో ఉంటే అభివృద్ధి ఎలా సాధ్యం
రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు దెబ్బతినే విధంగా రాజకీయాలు చేయకూడదని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు అన్నారు. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ అనేక అద్భుతాలు సాధించిందని తెలిపారు. పాలకులే నెగెటివ్ మైండ్ సెట్‌తో ఉంటే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ అనేక అద్భుతాలు సాధించిందని తెలిపారు. ఒకప్పుడు బెంగాల్ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనే నానుడి ఉండేదని, కానీ, కెసిఆర్ పాలనతో ‘తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనే వరకు తెచ్చామని చెప్పారు. గత 10 ఏండ్లలో తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉందని వ్యాఖ్యానించారు. తలసరి విద్యుత్ వినియోగంలో కూడా దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని, జిఎస్‌డిపి గ్రోత్‌లో తెలంగాణకు దరిదాపులో కూడా ఏ రాష్ట్రం లేదని పేర్కొన్నారు.

నల్లా ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని కెసిఆర్ అందించారని, మేనిఫెస్టోలో పెట్టుకోకపోయినా ఇంటింటికీ తాగునీరు అందించిన గొప్ప నాయకుడు కెసిఆర్ అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో వచ్చే ఎన్నికల నాటికి ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడుగను అని చెప్పిన గొప్ప నాయకుడు కెసిఆర్ అని, మిషన్ భగీరథ కార్యక్రమంతో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించి చూపించారని తెలిపారు. రైతుల కోసం దేశంలోనే నేరుగా నగదు బదిలీ చేసిన ఒకే ఒక కార్యక్రమం రైతుబంధు అని వ్యాఖ్యానించారు. గ్రీన్ కవర్ పెంచడం ద్వారా ఓట్లు రావు అని, కానీ భవిష్యత్ తరాల కోసం పచ్చదనాన్ని అందించిన ఏకైక నాయకుడు కెసిఆర్ అని పేర్కొన్నారు. ఆరోగ్యంలో కూడా మాతా శిశు మరణాల రేటును తగ్గిస్తూ దేశంలో మూడో స్థానంలో వచ్చామని తెలిపారు. ఇప్పటికీ బిఆర్‌ఎస్ అధికారంలో ఉండి ఉంటే ఇప్పటివరకు నంబర్ వన్ అయ్యేవాళ్లం అని పేర్కొన్నారు.

ఇప్పుడున్న ప్రభుత్వం పనిచేయడంపై దృష్టి సాధించకుండా గూగుల్ ప్రచారంపై దృష్టిపెట్టడం దురదృష్టం అని మండిపడ్డారు. హైడ్రాతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని విమర్శించారు. తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే..ఆంధ్రాలో ఒక ఎకరా అమ్మితే తెలంగాణలో పదెకరాలు వచ్చేది అని అనేవారు అని, ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రలో పది ఎకరాలు కొనవచ్చని హరీష్‌రావు అన్నారు. ఎన్నారైలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు ఎందుకు పెట్టడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News