Saturday, September 6, 2025

టీచర్లు బాగా పని చేస్తే మళ్లీ నేనే సిఎం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : టీచర్లు బాగా ప నిచేస్తే తాను కూడా కేజ్రీవాల్‌లాగా రెండు మూ డు సార్లు సిఎం అవుతానని ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో గతం లో కేజ్రీవాల్ రెండోసారి సిఎం కావడానికి ప్రధా న కారణం విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన సమూల మార్పులే అని పేర్కొన్నారు. కేజ్రీవాల్ విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన మా ర్పులను ఉపాధ్యాయులు విద్యార్థులకు అందించార ని, మన రాష్ట్రంలో కూ డా టీచర్లు బాగా పనిచేస్తే రెం డోసారి, మూడోసారి ముఖ్యమంత్రి కావాలని తనకు కూడా కొం చెం స్వార్థం ఉందని అన్నారు. టీచర్లే కష్టపడండి నేను సిఎం అవుతా అనట్లేదు మీతో పాటే నే నూ కష్టపడతా అంటూ ఉపాధ్యాయులను ఉద్దేశించి సిఎం వ్యాఖ్యానించారు.తాను ఫామ్‌హౌస్‌లో ప డుకుంటా మళ్లీ సిఎంను చేయండి అనట్లేదని ప రోక్షంగా మాజీ సిఎం కెసిఆర్‌పై విమర్శలు చేశా రు.

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం శిల్పకళా వేదికలో నిర్వహించిన టీచర్స్ డే కార్యక్రమం కార్యక్రమం ఘనంగా నిర్వహించా రు. ఈ కార్యక్రమానికి సిఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఉత్త మ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రు లు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, ఎంఎల్‌ఎలు,ఎంఎల్‌సిలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సిఎం రేవంత్‌రెడ్డి మా ట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో టీచర్లదే కీలక పాత్ర అని సిఎం అన్నారు. ప్రతి గ్రామానికి జై తెలంగాణ నినాదాన్ని ఉపాధ్యాయులు చేరవేశారని గుర్తు చేశారు. ఆనాడు టీచర్లు జయజయహే తెలంగాణ గీతాన్ని ఆలపించేలా చేశారని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులు సమస్యలు ఏళ్ల తరబడి పరిష్కారం కాలేదని అన్నారు. పదేళ్లలో విద్యాశాఖ అస్తవ్యస్తమైందని, ఈ శాఖలో సమస్యలు అర్థం చేసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. పదేళ్లుగా టీచర్ల బదిలీలు జరగలేదని, 2017 నుంచి టీచర్ల నియామకాలు జరగలేదని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కేవలం 55 రోజుల్లో 11 వేల టీచర్ల నియామకాలు పూర్తి చేశామని గుర్తు చేశారు. డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచాలన్న ఆలోచన ఆనాటి పాలకులకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. విద్యను లాభసాటి వ్యాపారంగా మార్చుకుని ఆధిపత్యం చెలాయించాలని ఆనాటి పాలకులు ప్రయత్నించారని ఆరోపించారు. ప్రొఫెసర్లను నియమించకుండా యూనివర్శిటీలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఉస్మానియా, కాకతీయ వైభవాన్ని కోల్పోయే పరిస్థితి ఆనాడు తీసుకొచ్చారని అన్నారు. చాలా చోట్ల కెజి టు పిజి వరకు ఉచిత విద్య అందడం లేదని, విద్యార్థులకు గత ప్రభుత్వం సరైన ఆహారం అందించలేదని ఆక్షేపించారు. విద్యారంగాన్ని గత ప్రభుత్వం వ్యాపారంగా మార్చుకుందని పేర్కొన్నారు.

గొప్ప చరిత్ర కలిగిన ఉస్మానియా వర్సిటీ మూతపడే పరిస్థితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ సంఘాలు ఎప్పుడు వచ్చినా సమస్యలు విని పరిష్కరించే ప్రయత్నం చేశామని చెప్పారు. ఎక్కడైనా కొంత ఆలస్యం కావచ్చు కానీ సమస్య పరిష్కరించకుండా ఉండలేదని, తెలంగాణ పునర్నిర్మాణంలో టీచర్ల సేవలు అవసరం అని వ్యాఖ్యానించారు. అత్యంత వివాదాస్పదమైన విద్యాశాఖను తీసుకోవద్దని తనకు కొందరు సూచించారని, అయినా సరే స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రతిసమస్యను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. పదేళ్లుగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకే విద్యాశాఖను తన వద్ద పెట్టుకున్నానని తెలిపారు. తెలంగాణకు నూతన విద్యావిధానం కావాలని సిఎం పేర్కొన్నారు. అందుకే ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించేందుకు ఒక కమిటీని నియమించామని అన్నారు. పేద పిల్లల జీవితాలను మార్చేలా విద్యావిధానం ఉండాలని చెప్పారు. పునాది బలంగా ఉన్నప్పుడే ఎన్ని అంతస్తులైనా కట్టొచ్చు అని, విద్య విషయంలోనూ పునాది బలంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని వ్యాఖ్యానించారు.

విద్యాభివృద్ధికి టీచర్లు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా
ప్రభుత్వ పాఠశాలల్లోనూ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు బోధిస్తున్నామని, ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకంటే నాణ్యమైన విద్య అందస్తామని ప్రతిజ్ఞ చేద్దామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఏటా 200 మంది టీచర్లను విదేశాలకు పంపి అక్కడి విద్యావిధానం అధ్యయనం చేసేలా ప్రోత్సహిస్తామని ప్రకటించారు. విద్యాభివృద్ధి కోసం టీచర్లు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని వెల్లడించారు. ఐటీఐలు అప్‌గ్రేడ్ చేసి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌గా మార్చామని, ఎటిసిలో టాటా కంపెనీ కల్పించిన సదుపాయాలు చూస్తే తనకే మతిపోతుందని అన్నారు. 140 కోట్ల మంది జనాభా ఉన్న భారత్ ఒలింపిక్స్‌లో ఒక్క స్వర్ణం సాధించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ కొరియాలో ఒక్క యూనివర్సిటీనే 16 స్వర్ణ పతకాలు సాధించిందని రేవంత్ రెడ్డి అన్నారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీయండని వారికి ప్రభుత్వమే అన్ని సదుపాయాలు కల్పిస్తుందని తెలిపారు. చదివితేనే భవిష్యత్ కాదని క్రీడల్లో రాణించినా భవిష్యత్ ఉంటుందని అన్నారు. క్రీడల్లో రాణించిన క్రికెటర్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్ డిఎస్‌పిలుగా ప్రస్తుతం ఉన్నారని ప్రశంసించారు.

పేదల తలరాత మార్చేది చదువు ఒక్కటే..
తెలంగాణలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే వాటిలో 24 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని, కానీ ప్రైవేట్ పాఠశాలలు 11 వేలు ఉంటే వాటిల్లో 34 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దీనికి కారణం.. అయితే నేను అయ్యి ఉండాలి లేదా మీరు అయ్యి ఉండాలంటూ టీచర్లను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. పిల్లలకు సరైన నమ్మకం కల్పించే పనులు తమ ప్రభుత్వం చేయకపోయి అయినా ఉండాలి లేదా అవన్నీ అమలు చేసినా మీ వైపు నుండి ఆలస్యం అయ్యి ఉండాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై పూర్తి స్థాయిలో నమ్మకం కల్పించలేకపోతున్నామని అన్నారు.టీచర్లు అంటే ఒక కుటుంబ పెద్దగా భావించాలని కోరారు.

ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని ఘటనలు జరిగినప్పుడు తనను ఎంతో ఆవేదన కలిగిందని అన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన సమయంలో పిల్లలతో కలిసి ఉపాధ్యాయులు భోజనం చేయాలని సూచించారు. అప్పుడే తప్పులు జరగకుండా ఉంటాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్‌కు ధీటుగా తీర్చిదిద్దుదామని ప్రతినబూనుదామని పిలుపునిచ్చారు. గతంలో ప్రతీ ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గేదని, కానీ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 లక్షల మంది విద్యార్థులు.. ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ బడుల్లోకి చేరారని హర్షం వ్యక్తం చేశారు. ఇందులో ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందని అభినందించారు. టీచర్లకు జీతాలు ఇవ్వడమే కాదు.. సదుపాయాలు కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు. పేదల తలరాత మార్చేది చదువు ఒక్కటే అని పేర్కొన్నారు.

నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నా
తాను ప్రభుత్వ పాఠశాలలో చదువుకొనే ఈ స్థాయికి వచ్చానని సిఎం చెప్పారు. గతంలో గురుపూజోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారా..? అని ప్రశ్నించారు. పిల్లలు ఎక్కువ సమయం టీచర్ల వద్దే ఉంటారని అన్నారు. పిల్లలతో కలిసే టీచర్లు మధ్యాహ్న భోజనం చేయాలని సూచించారు. ప్రైవేట్ స్కూల్స్ కంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎక్కువ విద్యావంతులు, సామాజిక బాధ్యత తెలిసినవారు అని పేర్కొన్నారు. టీచర్లకు జీతాలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు అని, మౌళిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అందుకే అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో స్వయం సహాయక సంఘాలకు నిర్వహణ బాధ్యత అప్పగించామన్నారు. ప్రతీ ఏటా రూ.130 కోట్లు స్కూల్స్ నిర్వహణకు నిధులు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. చదువొక్కటే పేదల తల రాతను, రాష్ట్రం తలరాతను మారుస్తుందని వ్యాఖ్యానించారు.

ఒక్క గంజాయి మొక్క కూడా మొలవనివ్వను..
ఇంజినీరింగ్ విద్యార్థులు గంజాయి పెడ్లర్‌గా మారుతున్నారని, డ్రగ్స్ వ్యసనాలు చిన్న మండలాలకు వ్యాపించిందని సిఎ రేవంత్‌రెడ్డి అన్నారు. పిల్లలను తల్లిదండ్రులు నిశితంగా పరిశీలించాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. తెలిసోతెలీకో కొంతమంది పిల్లలు డ్రగ్స్ బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చిన్నచిన్న పట్టణాలకు డ్రగ్స్ చేరుకుంటున్నాయని పేర్కొన్నారు. తప్పుదోవ పడుతున్న పిల్లలను దారిమళ్లించాలని టీచర్లకు సూచించారు. గంజాయి, డ్రగ్స్ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. తెలంగాణ గడ్డపై ఒక్క గంజాయి మొక్క కూడా మొలవనివ్వను అని పేర్కొన్నారు.తెలంగాణలో ఎక్కడ గంజాయి మొక్క మొలిచినా.. వాళ్ల సంగతి తేల్చేందుకే ఈగల్ ఫోర్స్ పనిచేస్తోందని సిఎం రేవంత్ స్పష్టం చేశారు.
టీచర్లతో కలిసి భోజనం చేసిన సిఎం
గురుపూజోత్సవం సందర్భంగా శిల్పకళావేదికలో ఉపాధ్యాయులతో కలిసి భోజనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భోజనం చేశారు. ఈ సందర్భంగా సిఎం ఉపాధ్యాయులతో ముచ్చటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News