Saturday, September 6, 2025

కాల్వలో తండ్రీకొడుకులు గల్లంతు

- Advertisement -
- Advertisement -

గణేశ్ నిమజ్జనం వేళ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు వ్యక్తి తండ్రి కాల్వలో పడిపోగా రక్షించబోయిన అతని కుమారుడు అందులో పడటంతో ఇద్దరూ గల్లంతయ్యారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా, వేములపల్లి మండలంలో వెలుగుచూసింది. ఎస్‌ఐ డి.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మాడ్గులపల్లి మండలం, ఆగామోత్కూర్ గ్రామానికి చెందిన పున్నా సాయన్న(50) గ్రామంలో పంటల మేస్త్రీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య చనిపోగా, కుమారుడు, కుమార్తె ఉన్నారు అతని కుమారుడు శివమణి (20) ఐటిఐ పూర్తి చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. వారు ఉండే వీధిలో ఏర్పాటు చేసిన గణేశ్ నవరాత్రి ఉత్సవాల అనంతరం వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా తండ్రి, కుమారుడు శోభాయాత్రలో ఉత్సాహంగా ఆనందంగా పాల్గొన్నారు. నిమజ్జనం సందర్భంగా ట్రాక్టర్‌లో గ్రామస్థులతో కలిసి వేములపల్లి మండల కేంద్రం

లోని సాగర్ ఎడమకాల్వ వద్దకు చేరుకుని వినాయకుని నిమజ్జనం చేశారు. అనంతరం ఇంటికి వెళ్లే క్రమంలో కాల్వకు అవతలి వైపు ట్రాక్టర్ ఆపి, గ్రామస్థులతోపాటు కాల్వలో కాళ్లు, చేతులు కడుక్కుంటుండగా సాంబయ్య ప్రమాదవశాత్తు కాల్వలో పడిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన అతని కుమారుడు శివమణి తండ్రిని కాపాడే క్రమంలో తాను సైతం కాల్వలో పడిపోయాడు. పక్కనే ఉన్న మరో యువకుడు వారిని కాపాడే ప్రయత్నం చేయగా, అప్పటికే వారు కాల్వలో కొట్టుకుపోయారు. ఈ విషయం వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడి చేరుకున్న పోలీసులు రిస్క్‌టీం సిబ్బంది కాల్వలోకి దిగి వెతికినా వారి ఆచూకీ లభ్యం కాలేదు. వారి ఆచూకీ కోసం కాల్వ వెంట గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News