Saturday, September 6, 2025

గంగ వైపు గణపయ్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో 30వేల మంది సిబ్బందితో
బందోబస్తు లక్షలాదిగా తరలిరానున్న
భక్తులు మధ్యాహ్నం 1.30గంటల వరకు
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి
ఏర్పాట్లు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

మన తెలంగాణ/సిటీ బ్యూరో: మునుపెన్నడూలేని విధంగా గ్రేటర్ హైదరాబాద్‌లో గణనాథుల నిమజ్జనానికి జీహెచ్‌ఎంసీ భారీ ఏర్పాట్లు చేసింది. పర్యావరణ హితంగా ఈ నిమజ్జన కార్యక్రమం జరిగేలా జీహెచ్‌ఎంసీ, పోలీస్, జలమండలి, హె చ్‌ఎండిఏ, విద్యుత్, పర్యావరణ శాఖలతో పాటు వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో సర్వం సిద్ద్ధం చేశారు. వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం 9 ప్రధాన చెరువులు, 74 కృత్రిమ నిమజ్జన కొలనుల వద్ద 134 స్టాటిక్ క్రేన్లు, 269 మొబైల్ క్రేన్లను జీహెచ్‌ఎంసి అందుబాటులోకి తెచ్చింది. హుస్సేన్ సాగర్ పరిసరాల్లోనే 40 క్రేన్ల ను ఏర్పాటు చేసింది. ఇందులో 11 భారీ క్రేన్లు ఉ న్నాయి. పెద్ద విగ్రహాల నిమజ్జనం వేగంగా, సురక్షితంగా జరిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వినాయక నిమజ్జనంలో భాగంగా భక్తు లు విగ్రహాలను ఊరేగించేందుకు 303.3 కిలోమీటర్ల మార్గాన్ని గుర్తించింది. ఈ మార్గాల్లో 13 కంట్రోల్ రూమ్ లు, 160 గణేశ్ యాక్షన్ టీమ్‌లు నిమజ్జనాన్ని పర్యవేక్షిస్తాయి. దాదాపు 40 గంటల పాటు జరిగే నిమజ్జనాన్ని ఉన్నతాధికారులు కమాండ్ కంట్రోల్ రూము ద్వారా పర్యవేక్షిస్తారు.

ఆపరేషన్ ఖైరతాబాద్..
ఖైరతాబాద్‌లోని విశ్వశాంతి మహాశక్తి గణపతి ని మజ్జనంపై ప్రభుత్వ విభాగాలు ప్రత్యేక దృష్టి సా రించాయి. నిమజ్జన ఘట్టంలో కీలకమైన ఈ ఏకదంతుడిని గంగమ్మ ఒడికి తరలించేందుకు కొన్నేళ్లుగా ప్రత్యేక ప్రణాళిక అమలుపరుస్తున్నారు. ఈ క్రమంలో నేడు(6న) కూడా మధ్యాహ్నం 1.30 గంటల వరకు మహా గణపతి నిమజ్జనం పూర్తి చే యాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. బాలాపూర్ గణపతి సాయంత్రంలోపు హుస్సేన్‌సాగర తీరానికి చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మహా గణపతి నిమజ్జనానికి హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో హు స్సేన్‌సాగర్‌లో 25అడుగుల లోతుకు పూడిక తీశా రు. ఖైరతాబాద్ గణేశ్ ఎత్తు, వెడల్పు కొలతలు తీసుకొని హుస్సేన్‌సాగర్‌లో పూడికతీత ప్రక్రియ ను పూర్తిచేశారు. 2 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించినట్టు అధికారులు వెల్లడించారు. భక్తుల కోసం 309 మొబైల్ టాయిలెట్లు, 102 మి నీ టిప్పర్లు, 125 జేసీబీలను ఏర్పాటు చేశారు. 10,500 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించి ప్రాసెసింగ్ యూనిట్లకు తరలించారు. చెత్త సేకరణ కో సం 5 లక్షల ట్రాష్ బ్యాగ్స్‌ను కూడా అధికారులు పంపిణీ చేశారు.

బాలాపూర్ శోభాయాత్ర
బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు వినాయకుడి ఊరేగింపు 19 కి.మీల ప్రధాన మార్గంతో పాటు.. గ్రేటర్ వ్యాప్తంగా 303 కి.మీలమేర గణనాథుల శోభాయాత్ర జరగనుంది. ఈ మార్గాల్లో ఈపాటికే 11,442 గుంతలు పూడ్చామని బల్ది యా వెల్లడించింది. నిమజ్జనం రోజున నగర విధు ల్లో 14,486 మంది పారిశుధ్య కార్మికులను నియమించారు. గణేశుడి శోభాయాత్ర మార్గాల్లో అదనపు విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. హుస్సేన్‌సాగర్‌లో అత్యవసర సేవలకు తొమ్మిది బోట్లు, ఇతర ప్రాంతాల్లోనూ ప్రత్యేక బోట్లతోపాటు డీఆర్‌ఎఫ్ టీంలను, 200 గజ ఈతగాళ్ళు అందుబాటులో ఉన్నారు. విద్యుత్ విభాగం కంట్రోల్ రూం, 9 వేల మంది సిబ్బంది, అధికారులు విధుల్లో ఉన్నారు. మహా నిమజ్జనం రోజున భక్తులకు తాగునీటికి కొ రత లేకుండా వాటర్‌బోర్డు నగరవ్యాప్తంగా 123వాటర్ క్యాంపులను ఏర్పాటు చేసింది. 35 లక్షల వాటర్ ప్యాకెట్లను అందుబాటులోకి తీ సుకురానున్నారు. శోభాయాత్ర కొనసాగే ప్రాం తాల్లో మ్యాన్‌హోల్ మూతలు పరిశీలించి అవసరమైన చోట్ల మరమ్మతు పనులు పూర్తిచేశారు. వాట ర్ లీకేజీలు, సీవరేజీ ఓవర్‌ఫ్లోలు లేకుండా ముం దస్తు తగు చర్యలు చేపట్టారు.

30వేల మందితో బందోబస్తు
నిమజ్జనం రోజున 30వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. పోలీసు విభాగాల సిబ్బంది. పారామిలిటరీ, రిజర్వ్ ఫోర్స్‌తో పాటు జిల్లాల నుంచి పోలీసు సిబ్బంది, అధికారులతో బందోబస్తు ఏర్పా ట్లు చేశారు. నేటి (సెప్టెంబరు 6) ఉదయం 6 గం టల నుంచి రేపు (7వ తేదీ) సాయంత్రం 6 గం టల వరకు నగరంలో మద్యం, కల్లు, విక్రయాలు నిలిపి వేయాలని పోలీసు కమిషనర్‌లు ఆదేశాలు జారీచేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యం లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ వెంకటి తెలిపారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు పరిసరాల మార్గాల్లో దాదాపు 44 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భక్తుల కోసం 7 మెడికల్ క్యాంపులు, అత్యవసర పరిస్థితులో రోగులను ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు తరలించడానికి అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. 56,187 తాత్కాలి క లైట్లను ఏర్పాటు చేశారు. 839.42 కి.మీ. పొడవునా చెట్ల కొమ్మలను తొలగించి, మార్గాల్లో 100 శాతం వెలుగు ఉండేలా చూశారు. పనిచేసే వర్క ర్లు, క్రేన్ ఆపరేటర్లకు విశ్రాంతి ఏర్పాట్లు చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,80,000కుపైగా విగ్రహా లు సురక్షితంగా నిమజ్జనం చేసినట్లు అధికారులు తెలిపారు. భద్రతకు సంబంధించి పోలీ సు భద్రత, షీ టీమ్స్ ఇతర బృందాలు ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News