జెడి చక్రవర్తి, నరేష్ అగస్త్య, సీరత్ కపూర్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘జాతస్య మరణం ధ్రువం’. శ్రవణ్ జొన్నాడ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని త్రిష సమర్పకురాలిగా సురక్ష్ బ్యానర్‌పై మల్కాపురం శివ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ప్రీతీ జంఘియానీ రీఎంట్రీ ఇస్తోంది. తాజాగా మేకర్స్ టీజర్ లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో జె.డి చక్రవర్తి మాట్లాడుతూ “నిర్మాత శివకుమార్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ని ముంబైలో ఎక్కడ రాజీపడకుండా చేస్తున్నారు. సీరత్ మంచి డాన్సర్, కొరియోగ్రాఫర్, సింగర్. ఈ సినిమాలో తన నటన అందరికీ నచ్చుతుంది.
డైరెక్టర్ శ్రవణ్ సినిమాని చాలా అద్భుతంగా తీశాడు”అని అన్నారు. డైరెక్టర్ శ్రవణ్ మాట్లాడుతూ “సినిమాలో ఇన్వెస్టిగేషన్ పార్ట్ అద్భుతంగా ఉంటుంది. జేడీ చక్రవర్తి, నరేష్ అగస్త్య, సీరత్ కపూర్, నిర్మాత శివకుమార్ చాలా సపోర్ట్ చేశారు”అని తెలిపారు. నిర్మాత మల్కాపురం శివ కుమార్ మాట్లాడుతూ “కొత్త డైరెక్టర్ శ్రవణ్ చెప్పిన కాన్సెప్ట్ అద్భుతంగా అనిపించింది. జెడి చక్రవర్తి, నరేష్, శరత్ కపూర్ మా బ్యానర్‌లో వర్క్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది పాన్ ఇండియా మూవీ”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరో నరేష్ అగస్త్య, సీరత్ కపూర్ పాల్గొన్నారు.
Also Read : పూర్తిగా బీస్ట్ మోడ్‌లో..