Saturday, September 6, 2025

కంటైనర్‌ను ఢీకొన్న ఆర్‌టిసి బస్సు: 30 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా నాయుడుపేట-పూతలపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం ఐతేపల్లి సమీపంలో కంటైనర్ ను ఆర్ టిసి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 మంది త్రీవంగా గాయపడడంతో రుయా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు 48 మంది ప్రయాణికులతో బెంగళూరు నుంచి శ్రీకాళహస్తి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో వాహనాలను పోలీసులు పక్కకు తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News