ఆసియా కప్ కోసం ప్రకటించిన జట్టులో శ్రేయస్ అయ్యర్‌ను (Shreyas Iyer) ఎంపిక చేయకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. పలు సిరీస్‌లలో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ.. శ్రేయస్‌కి సెలెక్టర్లు మొండిచెయ్యి చూపించారు. అయితే ఇప్పుడు శ్రేయస్‌కు ఓ బంపరాఫర్ దొరికే అవకాశం ఉంది. అతని సారథ్య బాధ్యతలు ఇస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అది సీనియర్ జట్టుకు కాదు. త్వరలో ఇండియా ఎ జట్టు, ఆస్ట్రేలియా ఎతో రెండు అనధికారిక టెస్ట్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లో ఆసీస్‌తో తలపడే ఇండియా ఎ జట్టుకు శ్రేయస్‌కు కెప్టెన్సీ అప్పగిస్తారని టాక్.
అయితే ఈ సిరీస్ కోసం శ్రేయస్‌తో (Shreyas Iyer) పాటు నితీశ్ కుమార్ రెడ్డి, అభిమన్య ఈశ్వరన్, సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్, రజత్ పాటిదార్, కరుణ్ నాయర్, ఎన్ జగదీసన్ తదితర ఆటగాళ్లు ఎంపిక అయ్యే అవకాశం ఉంది. అయితే ఆసియా కప్‌కు ఎంపిక కాకపోవడంతో శ్రేయస్ దేశవాళీ క్రికెట్‌పై దృష్టిసారించాడు. ప్రస్తుతం అతడు దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 28 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 25 పరుగులు చేశాడు. ఇదే మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ 184 పరుగులతో చెలరేగిపోగా.. యశస్వీ జైస్వాల్ మాత్రం 4 పరుగులు మాత్రమే చేశాడు. మరి నితీశ్‌కు ఇండియా ఎ కెప్టెన్సీ ఇస్తారో.. లేదో.. తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఎదురుచూడాలి.
Also Read : ప్రపంచకప్-2025కి జట్టును ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా