స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గత ఏడాది ‘కల్కి-2848 AD’ సినిమాతో ఆయన భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం చేస్తున్న ‘స్పిరిట్’ ఒకటి. ఈ సినిమాలో ప్రభాస్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. అయితే మా ‘యానిమల్’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకు సందీప్.. ఈ సినిమాలో ప్రభాస్‌ని ఎలా చూపిస్తారో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి చిన్న లీక్ వచ్చినా.. అది కొద్దిసేపట్లోనే సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ని బయటపెట్టారు సందీప్.
జగతిబాబు హోస్ట్‌గా ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే షోలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కలిసి సందీప్ (Sandeep Reddy Vanga) పాల్గొన్నారు. ఈ షోలో సందీప్ మాట్లాడుతూ.. ఆర్జివి తనకు చాలా విషయాల్లో గురువు అని అన్నారు. ఆ తర్వాత బాహుబలి 2 సినిమా ఇంటర్వ్యెల్ చూసి.. అర్జున్ రెడ్డి ఇంటర్వ్యెల్ అందరికి నచ్చుతుందా అని భయపడినట్లు తెలిపారు. ఆ తర్వాత స్పిరిట్ సినిమా గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. ‘‘ఏ సినిమాకు అయినా షూటింగ్ కంటే ముందే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సిద్ధం చేసుకుంటే.. చాలా సమయం మిగిలుతుంది. ఈ విషయం అర్జున్ రెడ్డి సమయంలో తెలియలేదు. యానిమల్కు మాత్రం ముందు జాగ్రత్త పడ్డాడు. సినిమాకు ముందే 80 శాతం మ్యూజిక్ పని పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు స్పిరిట్ విషయంలోనూ అదే పని చేస్తున్నా. ఇప్పటికే 70 శాతం మ్యూజిక్ వర్క్ పూర్తయింది’’ అని సందీప్ పేర్కొన్నారు.
ప్రభాస్ స్టార్ హీరో కాబట్టి.. అతనితో పని చేయడం ఎలా ఉంటుందో అని భయపడ్డనని కానీ, ప్రభాస్ చాలా స్వీట్ పర్సన్ అని కితాబిచ్చారు. అతడితో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని తెలిపారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని.. అప్పుడు సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ చెబుతానని సందీప్ అన్నారు.
Also Read : అంతర్జాతీయ స్థాయిలో నాలుగు అవార్డులు