హైదరాబాద్: సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. శనివారం ఉదయం ఆయన శ్రీశైలం వెళ్లి వస్తుండగా అస్వస్థతకు గురైనట్టు సమాచారం. వెంటనే పోలీస్ ఉన్నతాధికారులు ఆపోల్ ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేయడానికి ప్రవీణ్ హైదరాబాద్‌కు వచ్చినట్టు సమాచారం. హైదరాబాద్ రాగానే కోఠిలో సిబిఐ కార్యాలయంలో అధికారులతో ఆయన రెండు గంటలపాటు సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం అధికారులతో పలు అంశాలపై చర్చించడంతో పాటు, కాళేశ్వరం కమిషన్ ప్రాజెక్టు సంబంధించిన నివేదికపై ఆరా తీసినట్లు సమాచారం. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్‌డిఎస్‌ఏ) రిపోర్ట్ ఆధారంగా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన కాళేశ్వ రం నివేదికపై సిబిఐ విచారణ చేపట్టాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన విషయం తెలిసిందే. వెంటనే సిబిఐ డైరెక్టర్ హైదరాబాద్ రావడంతో హాట్ టాఫిక్‌గా మారింది.
Also Read: హైదరాబాద్ లో సిబిఐ డైరెక్టర్