అమరావతి: ఎపి రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తోందని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కో-ఆర్టినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. యూరియా అడిగితే బొక్కలో తోస్తానంటూ సిఎం చంద్రబాబు మాట్లాడతారా? అని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. తాడేపల్లిలో ఈ నెల 9 న వైఎస్ఆర్ పి అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, యూరియా కొరత, రైతాంగ సమస్యలపై నిరసనలకు పిలుపునిస్తున్నామని తెలియజేశారు. ఆర్డివో కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనులకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
‘అన్నదాత పోరు’ పోస్టర్ ని సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించనున్నామని పేర్కొన్నారు. తొక్కుతాం, నారతీస్తామంటూ రైతులను బెదిరిస్తారా? అని రైతులంటే ఎపి సిఎంచంద్రబాబు నాయుడుకు ఎందుకంత చిన్నచూపు?అని మండిపడ్డారు. ఈ ప్రభుత్వ మెడలు వంచుతామని, రైతులకు యూరియా సరఫరా చేసే వరకు పోరాటం చేస్తామని సజ్జల హెచ్చరించారు. 9న ఆర్ డివొ కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేపడతామని అన్నారు. యూరియాను టిడిపి నేతలే బ్లాక్ మార్కెట్ కు తరలించుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
Also Read : తాడిపత్రికి చేరుకున్న పెద్దారెడ్డి