న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం ఎర్ర కోటలో (Red fort) భారీ చోరీ జరిగింది. ఎర్ర కోటలో సెప్టెంబర్ 3న ఓ మతపరమైన కార్యక్రమం జరిగింది. అయితే ఆ కార్యక్రమం అనంతరం పూజ కోసం తెచ్చి 760 గ్రాముల బరుపున్న బంగారు కలశం, వజ్రాలు, మాణిక్యాలు, పచ్చలు పొదిగిన మరో చిన్న కలశం చోరీకి గురయ్యాయని వ్యాపారవేత్త సుధీర్ కుమార్ జైన్ ఎర్రకోట నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. పూజకు ప్రముఖలు రావడంతో తాము పక్కకు వెళ్లామని తిరిగి వచ్చే సరికి దొంగతనం జరిగిందని తెలిపారు.
పోలీసులు ఘటనా స్థలానికి (Red fort) చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. అక్కడ సిసిటివి ఫూటేజీని పరిశీలించారు. ఫుటేజీలో ఎవరూ లేని సమయంలో ఓ వ్యక్తి వచ్చి ఎవరు కలశాలు తీసుకున్నట్లు గుర్తించారు. నిందితడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడు ఇప్పటికే పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డాడినట్లు ఆరోపణలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
Also Read : ఢిల్లీలో భార్య, అత్తను కత్తెరతో చంపేసిన వ్యక్తి