Saturday, September 6, 2025

సిఎం కారుపై జరిమానా.. డిస్కౌంట్‌లో కట్టేశారు..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ట్రాఫిక్ చలానాలపై కర్ణాటక ప్రభుత్వం 50 శాతం డిస్కాంట్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే. వాహనదారులకు ఊరట కలగించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునంది. అయితే కర్ణాటక సిఎం సిద్ధరామయ్య (Siddaramaiah) ప్రయాణించే కారుపై కూడా జరిమానాలు ఉన్నాయి. దీంతో డిస్కౌంట్‌ని ఉపయోగించి ఆ జరిమానాలు కట్టేశారు. సిద్ధరామయ్య ప్రయాణించే కారుపై మొత్తం ఏడు చలానాలు ఉన్నాయి. అందులో ఆరు సీటు బెల్ట్ ధరించకపోవడం వల్ల అయితే.. ఇంకోటి ఓవర్ స్పీడ్ కారణంగా చలాన పడింది. అయితే సిఎం కారుకు ఉన్న చలానాలు చెల్లించలేదుని ఇటీవల సోషల్‌మీడియాలో విమర్శలు వచ్చాయి. దీంతో సిఎం యంత్రాంగం డిస్కౌంట్ పథకాన్ని ఉపయోగిస్తూ.. రాయితీ అనంతరం రూ.8,750 చెల్లించింది.

జరిమానా పడిన వాహనదారులు సగం కడితే సగం మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 21న ఈ పథకం ప్రారంభంకాగా.. సెప్టెంబర్ 19వ తేదీ వరకూ ఇది అమలులో ఉండనుంది. రాయితీ పథకం ద్వారా ఇప్పటివరకూ రూ.40 కోట్లు వసూలైనట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. (Siddaramaiah)

Also Read: ఎర్ర కోటలో భారీ చోరీ.. రూ.కోటి విలువైన కలశాలతో పరార్..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News