Sunday, September 7, 2025

‘బిగ్‌బాస్‌ 9’ లాంచ్ ప్రోమో.. డబుల్ హౌస్.. డబుల్ డోస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు రియాలిటీ షోలలో బిగ్‌బాస్‌కి ఉన్న క్రేజ్ వేరే లెవల్. గత ఎనిమిది సీజన్లుగా ఈ షో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ఇప్పుడు తొమ్మిదో సీజన్ (Bigg Boss Season 9) ఈ రోజు (ఆదివారం) సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభంకానుంది. ఈ సీజన్‌లో సెలబ్రిటీలతో పాటు సామన్యలు కూడా పాల్గొనే అవకాశం కల్పించారు. అందుకోసం కొందరిని సెలెక్ట్ చేసి.. ‘బిగ్‌బాస్ అగ్నిపరీక్ష’ అనే ప్రొగ్రామ్‌ని నిర్వహించారు. ఈ ప్రొగ్రామ్‌కి శ్రీముఖి యాంకర్‌గా ఉండగా.. నవ్‌దీప్, బింధు మాధవి, అభిజీత్‌లు జడ్జ్‌లుగా వ్యవహరించారు.

ఇప్పుడు అసలైన ఘట్టానికి రంగం సిద్ధమైంది. బిగ్‌బాస్ 9వ (Bigg Boss Season 9) సీజన్ ప్రారంభం కానున్న వేళ.. ఆ షోకి సంబంధించిన లాంచ్ ప్రోమోని విడుదల చేశారు. ఊహకందని మార్పులు, ఊహించని మలుపులు అంటూ వచ్చే డైలాగ్‌తో ఈ ప్రోమో ప్రారంభం అవుతుంది. ప్రతిసారిలా కాకుండా ఈసారి డబుల్ హౌస్‌తో బిగ్‌బాస్ అలరిస్తుందని ప్రోమో చూస్తే తెలుస్తుంది. ‘ఇప్పటివరకూ నాలో యుద్ధభూమిలో శంఖం పూరించే కృష్ణుడిని చూశారు.. ఈ సీజన్‌లో రంగంలో దిగే అర్జునుడిని చూస్తారు’ అంటూ బిగ్‌బాస్ చెప్పగా.. ‘నేను దేనికైనా సిద్ధమే’ అని నాగార్జున అంటారు. అయితే ఈ షోలో పాల్గొనే సెలబ్రిటీలు ఎవరనే విషయాన్ని ప్రోమో చూపించలేదు. మొత్తానికి ప్రోమో చూస్తే.. షో ఓ రేంజ్‌లో ఉండనుందని అర్థమవుతోంది. ఈ ప్రోమో చూసిన బిగ్‌బాస్ ఫ్యాన్ షో ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురుచూస్తున్నాం అని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : త్వరలోనే ఫన్ అప్డేట్.. శ్రీలీల వీడియో వైరల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News