స్కూల్లో చిన్నారులు తప్పు చేస్తే.. టీచర్లు పనిష్మెంట్ ఇవ్వడం ఎక్కడైనా జరిగే పనే. అయితే ఆ పనిష్మెంట్ పరిమితులు దాటి చిన్నారి ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా ఉండకూడదు. కానీ, ఓ టీచర్ మాత్రం రెండో తరగతి చిన్నారికి ఘోరమైన పనిష్మెంట్ ఇచ్చింది. అది కూడా అడగకుండా టాయిలెట్‌కి వెళ్లిందనే చిన్న కారణంతో. ఛత్తీస్‌గఢ్‌లో (Chhattisgarh) చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రతాప్‌గఢ్‌లోని ఓ పాఠశాలలో అడగకుండా టాయిలెట్‌కి వెళ్లిన కారణంగా రెండో తరగతి చదువుతున్న విద్యార్థినితో నమ్రతా గుప్తా అనే టీచర్ బలవంతంగా 100 గుంజీలు తీయించింది. ఆ తర్వాత కర్రతో కొట్టింది. ఈ కారణంగా చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురయింది. దీంతో కుటుంబసభ్యులు ఆ పాపను ఆస్పత్రికి తరలించారు.
చిన్నారి పరిస్థితిని పరిశీలించిన వైద్యులు ఎక్కువ మొత్తంలో గుంజీలు తీయడంతో కాళ్లలో కండరాలు దెబ్బతిన్నట్లు తెలిపారు. అయితే ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసిన సదరు టీచర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. టీచర్ ఇచ్చిన పనిష్మెంట్ కారణంగా చిన్నారి నడవలేకపోతుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం జిల్లా విద్యాశాఖ (Chhattisgarh) దృష్టికి వెళ్లడంతో ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. దర్యాప్తులో అసలు బాలికను గుంజీలు తీయించిన టీచర్ ఆమె చదువుతున్న తరగతిలో ఎలాంటి పాఠాలు చెప్పరని తేలింది. సదరు ఉపాధ్యాయురాలిని వెంటనే అధికారులు సస్పెండ్ చేసి.. ప్రిన్సిపాల్‌ను సెలవుల మీద పంపారు.
Also Read : తరగతి గదిలో విద్యార్థినితో మసాజ్ చేయించుకున్న టీచర్… వీడియో వైరల్