పిల్లలకు చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు నేర్పించాలి. ముఖ్యంగా రోడ్డుపై ప్రయాణించేప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో కచ్చితంగా వివరించాలి. కానీ, పిల్లలు ప్రమాదకరమైన స్టంట్స్ వేస్తుంటే.. వాటిని తల్లిదండ్రులు ప్రోత్సాహించడం అంత మంచిది కాదు. బెంగళూరులో (Bengaluru) ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ కారు సన్‌రూఫ్ నుంచి బాలుడు తల బయటకు పెట్టి నిర్లక్ష్యంగా ప్రయాణించాడు. నగరంలోని విద్యారణ్యపురిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అదే సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బారియర్ అతని తలను ఢీకొంది. అయితే ఈ ఘటనలో బాలుడికి గాయాలయ్యాయా? లేదా? అనే విషయంలో స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు తల్లిదండ్రుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. కొందరు నెటిజన్లు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Also Read : అడగకుండా టాయిలెట్‌కు వెళ్లిందని.. చిన్నారికి ఘోరమైన పనిష్‌మెంట్