Monday, September 8, 2025

ట్రిపుల్ ఆర్ రైతుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధం: రాజగోపాల్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

సంస్థాన్ నారాయణపురం: ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్‌పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopalreddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంస్థాన్ నారాయణపురంలో ఆయన భూనిర్వాసితులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓ కంపెనీ కో్సం గత ప్రభుత్వ హయాంలో అలైన్‌మెంట్ మార్చారని అన్నారు. ఇప్పుడు దక్షిణభాగం అలైన్‌మెంట్ మారాలంటే.. ఉత్తరభాగం మారాలని.. ఉత్తరభాగం అలైన్‌మెంట్ మారాలంటే ప్రభుత్వమే మారాలేమో అని ఎద్దేవా చేశారు. చౌటుప్పల్‌ డివిజన్‌లో ఆర్ఆర్ఆర్ నిర్వాసితులు తొక్కని గడపలేదని.. ఢిల్లీలోని పెద్దలను కలిసినా భూనిర్వాసితులకు న్యాయం జరగలేదని తెలిపారు.

ట్రిపుల్ ఆర్ రైతుల కోసం ఎలాంటి త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopalreddy) హామీ ఇచ్చారు. మునుగోడులో నిధులు ఇవ్వకపోతే గతంలో రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తన రాజీనామాతో నియోజకవర్గం అభివృద్ధికి నిధులు వచ్చాయని అన్నారు. మంత్రి పదవి విషయంలో నాకు హామీ ఇఛ్చారు.. కానీ, తనకు అన్యాయం జరిగిన ఫర్యాలేదు.. ప్రజలకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే ఎంత దూరమైనా వెళ్తా అని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు.

Also Read : ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం పూర్తి: సిపి ఆనంద్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News