Tuesday, September 9, 2025

వారంలో ఎంబిబిఎస్, బిడిఎస్ కౌన్సెలింగ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వారంలో ఎంబిబిఎస్, బిడిఎస్ కన్వీనర్ కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నది. వైద్య విద్యలో ప్రవేశానికి 9 నుంచి 12వ తరగతి వరకు.. నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి అంటూ రాష్ట్ర ప్రభుత్వం 2017లో జారీ చేసిన జిఒ -33ని సుప్రీంకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆ జిఒలో చేసిన సవరణను కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమోదించింది. ఈ నేపథ్యంలో జిఒ 33పై ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన వెంటనే కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎంబిబిఎస్, బిడిఎస్ ప్రక్రియ కౌన్సెలింగ్ ప్రారంభించనున్నది. రాష్ట్రంలో ఎంబిబిఎస్, బిడిఎస్ కన్వీనర్ కోటా కౌన్సిలింగ్‌కు జులై నెలలో కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేయగా, విద్యార్థులు వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

కాగా, స్థానికత, ఆలిండియా కోటాపై స్పష్టత లేక.. ప్రక్రియ నిలిచిపోయింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పుడు వైద్యవిద్యలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఈ వారంలో ఎంబిబిఎస్, బిడిఎస్ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థుల మెరిట్ జాబితా ప్రకటించి, కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రారంభించేందుకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మొత్ంత 8,515 ఎంబిబిఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 4,090 సీట్లు ఉండగా.. వాటిలో 613 సీట్లను ఆలిండియా కోటాకు కేటాయించారు. ఒక ప్రభుత్వ, 11 ప్రైవేటు డెంటల్ కళాశాలల్లో 1,140 సీట్లు ఉన్నాయి.

Also Read: ఉప రాష్ట్రపతికి నో సాలరీ..!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News