ట్రిపుల్ ఆర్ నిర్వాసితులకు అన్యాయం జరగనివ్వను
పదవి ఇస్తానన్నా తలొగ్గను, ఈ ప్రాంత ప్రజలే నాకు ముఖ్యం
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
మన తెలంగాణ/సంస్థాన్ నారాయణపురం: తనకు అన్యాయం జరిగినా ఊరుకున్నానని, కాని ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకోనని, ఎంతదూరమైనా వెళతాననిమునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ట్రిపుల్ ఆర్ రద్దయినా సరే భూ నిర్వాసితులకు అన్యాయం జరగనివ్వనని భరోసా ఇచ్చారు. యాదాద్రి భువనగి రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేం ద్రంలోని రా ఘవేంద్ర ఫంక్షన్ హాలులో త్రిపుల్ ఆర్ దక్షిణ భాగానికి సంభంధించిన భూ నిర్వాసితులతో ఆదివారం ఎమ్మెల్యే రాజ్‌గోపాల్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ భాగం అలైన్‌మెంట్ మారితే ఉత్తర భాగం మారాలి, ఉత్తర భాగం మారాలంటే ప్రభుత్వమే మారాలేమో అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజలే తన బలం.. బలగమని వారి కోసం ఎ లాంటి పోరాటానికైనా సిద్దమని, అందుకు ప్రజలు కూడా సిద్ధ్దంగా ఉండాలని కోరారు. నేను అధికార పార్టీ ఎమ్మెల్యేనైనా సరే ప్రజలకు మాత్రం అన్యాయం జరగనివనన్నారు. నేను లాలూచీపడి సిఎం దగ్గరకు వెళ్లి పదవి ఇస్తంటే చప్పుడు చేయకుండా కూర్చోనని, నాకు ఈ ప్రాంత ప్రజలే ముఖ్యమని సిఎంకు చెబుతానని చెప్పారు. భూమికి, రైతుకు మధ్య భావోద్వేగ అనుబంధం ఉంటుందని, అది వి డదీయలేనిదని, భూమి అంటే వ్యవసాయం ఒక్కటే కాదని అది స్టేటస్ అని అన్నారు. త్రిపుల్ ఆర్‌లో మునుగోడు ప్రజలే ఎక్కువ భూమిని కోల్పోతున్నారని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని, అవసరమైతే కేంద్ర మంత్రులను కలుస్తానని చెప్పారు. మీకు న్యాయం జరిగే వరకు మీతో కలిసి పోరాడుతానని రైతులకు భరోసా ఇచ్చారు.