Tuesday, September 9, 2025

నెల్లుట్ల రమాదేవికి కాళోజీ పురస్కారం

- Advertisement -
- Advertisement -

ఈ నెల 9న రవీంద్రభారతిలో పురస్కార ప్రదానం
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రతిష్టాకర ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారానికి ప్రముఖ రచయిత్రి, కాలమిస్ట్ నెల్లుట్ల రమాదేవిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ జయంతి సందర్భంగా అందిస్తున్న ఈ పురస్కారాన్ని 20 25వ సంవత్సరానికి నెల్లుట్ల రమాదేవిని వరించింది. కాళోజీ సాహితీ పుర స్కార గ్రహీత ఎంపిక కోసం తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ అధ్యక్షతన నిపుణుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఈ కమిటీ నెల్లుట్ల రమాదేవిని 2025వ సంవత్సరపు కాళోజీ సాహితీ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 9న సాయంత్రం రవీంద్రభారతిలో కాళోజీ జయంతి ఉత్సవాల సంద ర్భంగా తెలంగాణ భాషా దినోత్సవం వేడుకల వేదికపై ఈ పురస్కారాన్ని ఆమెకు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇలా ఉండగా ఈ పురస్కారానికి ఎంపికైన నెల్లుట్ల రమాదేవిని, అలాగే ఎంపిక చేసిన కమిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News