రాయలసీమ వాళ్లకు ఈ వంటకం అంతగా తెలియదు.. నేను వైజాగ్ లో ఉన్నప్పుడు విజయశంకర్ అనే మా మిత్రుని ఇంటిలో తిన్నాను. దీనిని చట్నీతో కానీ తేనె పానకంతో కానీ తింటారు. ఈ తేనె పానకం అనేది బెల్లంతో చేస్తారు..
ఇది ఇడ్లీ మాదిరే ఉండే డిఫరెంట్ ఇడ్లీ అంటే ఇది ఇడ్లీకి రొట్టెకు మధ్యలో పుట్టింది.. దీనిని కూడా మినప బాళ్ళు, ఇడ్లీరవ్వ, బియ్యం పిండి కలిపి పిండి తయారు చేసి చేస్తారు.. కాకపోతే దీనిని ఆరు గంటలు మొదట నాన్న పెడతారు తర్వాత పిండి చేస్తారు. కాకపోతే దీనిని పర్మంటేషన్ కోసము రాత్రంతా పెట్టరు.. వెంటనే చేస్తారు. ఇది చాలా ప్లఫీగా దూదిలా ఉంటుంది.. చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఓ రెండు పీసులు తిన్నావంటే మనకు కడుపు నిండిపోతుంది. ఇది గోదావరి జిల్లాలలో ఎక్కువగా చేస్తారు. నేనైతే వైజాగ్లో తిన్నాను. మీరు తిన్నారా?
డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్
గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు
- Advertisement -