కరీంనగర్: ఓ ప్రైవేటు ఆస్పత్రిలో యువతిపై మేల్ నర్సు అత్యాచారం చేశాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ యువతికి తీవ్ర జ్వరం రావడంతో తన తల్లితో కలిసి ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చారు. ఆమె జ్వరంతో పాటు భాగా నీరసంగా ఉండడంతో ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. ఎమర్జెన్సీ వార్డుకు పక్కనే ఉన్న హాల్‌లో తల్లి నిద్రకు ఉపక్రమించింది. మేల్‌నర్సుగా పని చేస్తున్న యువకుడు యువతి మత్తు ఇంజక్షన్ ఇచ్చి అనంతరం ఆమెపై అత్యాచారం చేశాడు.
యువతికి మెలకువ వచ్చిన తరువాత ఇబ్బంది ఉండడంతో జరిగిన విషయం తన తల్లికి చెప్పింది. ఆమె ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నించడంతో అక్కడ ఉన్న అవాక్కయ్యారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నామని, ఆస్పత్రిలో ఉన్న సిసి కెమెరాలను పరిశీలిస్తున్నామని సిఐ తెలిపారు. యువతిని ఆరోగ్య పరీక్షల నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించామని వెల్లడించారు.