Tuesday, September 9, 2025

జనగామలో గురుకుల పాఠశాలలోకి బీర్ బాటిల్ తో వెళ్లిన వ్యక్తి… వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

జనగాం: బాలికల హాస్టల్లోకి బీరు బాటిల్‌తో వెళ్తున్న వ్యక్తిని విద్యార్థినిల తల్లిదండ్రులు అడ్డుకున్నారు. అనంతరం వారు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన జనగామ జిల్లాకు సమీపంలో గల పెంబర్తి మహాత్మ జ్యోతిరావు ఫూలే బాలికల గురుకుల పాఠశాలలో జరిగింది. ఓ వ్యక్తి పల్సర్ బైక్ పై బీర్ బాటిల్‌తో కళాశాలలోకి ప్రవేశించాడు. ప్రైవేట్ వ్యక్తి లోపలికి వెళ్లడాన్ని చూసి గేటు ముందు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లనే ఇలా జరుగుతుందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికల హాస్టల్లోకి బీరు బాటిళ్లతో ప్రవేశించడంతో వారి భద్రతపై వారు ఆందోళన చెందుతున్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాలికలు ఉండే హాస్టల్ లోకి పురుషులు వెళ్లడం ఏంటని విద్యార్థినిల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

Also Read: అలైన్‌మెంట్ మారాలంటే ప్రభుత్వం మారాలేమో!: రాజగోపాల్‌రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News