- Advertisement -
అమరావతి: ఆసియా కప్ 2025లో అత్యుత్తమ విజయం సాధించారని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. దక్షిణ కొరియాపై విజయం సాధించి 8 ఏళ్లల తర్వాత టైటిల్ సాధించిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత పురుషుల హాకి జట్టుకు అభినందనలు తెలియజేశారు. ఈ విజయం భారత క్రీడల్లో గర్వించదగ్గ మైలురాయి అని యువ అథ్లెట్ల ధైర్యం, పట్టుదలకు ప్రకాశవంతమైన ఉదాహరణ అని చంద్రబాబు కొనియాడారు. భారతదేశ హాకీ వారసత్వాన్ని ఇకపైనా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నానని అన్నారు. ప్రపంచ వేదికపై మరిన్ని చిరస్మరణీయ ప్రదర్శనలు ఇస్తారని విశ్వసిస్తున్నానని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Also Read : రారాణి సబలెంక
- Advertisement -