ఖాట్మండూ : నేపాల్‌లో సోషల్ మీడియాపై ఇ టీవల అక్కడి ప్రభుత్వం విధించిన నిషేధం హిం సకు దారి తీసింది. సోమవారం కేపీ శర్మ ఓలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత చేపట్టిన ఆందోళన హింసాత్మకమైంది. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు 20మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికిపైగా గాయపడ్డారు. నైతిక బా ధ్య త వహిస్తూ హోంమంత్రి లేఖక్ రాజీనామా చేశా రు. ఆస్పత్రుల నుంచి అందిన సమాచారం ప్ర కారం ట్రామా సెంటర్లో ఆరుగురు, సివిల్ ఆ స్పత్రిలో ముగ్గురు, ఎవరెస్ట్ ఆస్పత్రిలో ముగ్గు రు, ఖాట్మండూ మెడికల్ కాలేజీలో ఒకరు , త్రి భువన్ యూనివర్శిటీలో ఒకరు ప్రాణాలు కో ల్పోయారని హిమాలయన్ టైమ్స్ వార్తాపత్రిక కథనం వెల్లడించిం ది.
రాజధాని ఖాట్మండూలో ‘జెడ్ జనరేషన్’ యువత భారీ ఎత్తున నిరసనకు దిగింది. పార్లమెంట్ వద్ద బారికేడ్లు తోసుకుని లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆందోళన కారులకు, భద్రతా దళాలతో ఘర్షణ జరిగింది. దీంతో కాల్పులు జరిపి ఆందోళనకారులను అదుపు చేయాల్సి వ చ్చింది. వేల మంది యువతతో ఖాట్మండూ జనసముద్రంగా మారిపోయింది. పోలీసులు ప్రకటించిన నిషేధిత జో న్లను కూడా వారు లెక్క చేయలేదు. తన స్నేహితుడి తలలోంచి బుల్లెట్ దూసుకెళ్లడం, అతడు కుప్పకూలడం కళ్లారా చూశానని ఓ యువకుడు రోదిస్తూ వివరించాడు. ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయమే దీనికి కారణమని అతడు మండిపడ్డాడు.
రాజధానిలో కర్ఫూ విధింపు…
హింసాత్మక సంఘటనల కారణంగా రాజధాని నగరంలో అనేక చోట్ల కర్ఫూ విధించారు. పార్లమెంట్ భవనం పరిసరాల్లో మధ్యాహ్నం 12.30 నుంచి రాత్రి 10 గంటల వరకు నిషేధాజ్ఞలు విధించారు. జనసంచారం పనికి రాదని, నిరసన ప్రదర్శనలు, సమావేశాలు , గుమికూడడాలు నిషేధమని చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ చాబిలాల్ రిజాల్ హెచ్చరించారు. రాష్ట్రపతి భవన్, వైస్ ప్రెసిడెంట్ నివాసం, ప్రధాని కార్యాలయం వద్ద కూడా నిషేధాజ్ఞలు విధించారు.
ఎందుకు నిషేధం విధించారు..?
గడువు లోపల కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక శాఖ వద్ద రిజిస్టర్ కానందుకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్, యూట్యూబ్ , ఎక్స్, రెడిట్, లింకిన్ వంటి 26 సామాజిక మాద్యమాలపై నేపాల్ ప్రభుత్వం గత గురువారం నిషేధం విధించింది. ఈ గడువు బుధవారం రాత్రి తీరిపోయినా అవి రిజిస్టర్ కాలేదు. టిక్‌టాక్, వైబర్, విట్క్, నింబజ్, పోపో లైవ్ మాత్రం రిజిస్టర్ అయ్యాయి. టెలిగ్రామ్, గ్లోబల్ డైరీలు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేశాయి. వాటికి ఆమోదం తెలిపే ప్రక్రియ నడుస్తోంది. క్రమబద్ధీకరణ కోసం వీటిని నిషేధించడమైందని ప్రభుత్వం తన విధానాన్ని స్పష్టం చేసినా , ప్రజలు మాత్రం ఇది భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడిగా చివరకు సెన్సార్‌కు దారి తీసిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని కెపి శర్మ ఒలి ఆదివారం ఒక ప్రకటనలో దేశాన్ని అణగదొక్కే క్రమశిక్షణ రాహిత్యాన్ని,
నిర్లక్షాన్ని తమ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని హెచ్చరించారు. తమ పార్టీ సామాజిక మాధ్యమాలకు వ్యతిరేకం కాదని, అయితే ఈ మాధ్యమాలను అడ్డంపెట్టుకుని వ్యాపారాలు చేయడాన్ని తాము అంగీకరించేది లేదని పేర్కొన్నారు. చట్టానికి వ్యతిరేకంగా ధన సంపాదన చేస్తున్నారని ఆరోపించారు. ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం నిషేధం వల్ల చదువు కోసమో, సంపాదన కోసమో, విదేశాల్లో ఉంటున్న 70 లక్షల మంది నేపాలీ యువత స్వదేశంలో కుటుంబ సభ్యులతో బంధు మిత్రులతో సంభాషించే అవకాశం కోల్పోతారు. మరోవైపు ప్రధాని కెపి శర్మ ఓలీ తాజా హింస నేపథ్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. పరిస్థితిని అధికారులతో సమీక్షించారు. ఇక విపక్షం మాత్రం 20 మంది మరణానికి కారణమైన ఓలీ పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు.
పాత్రికేయుల సమాఖ్య నిరసన
ప్రభుత్వ నిషేధం భావ ప్రకటన, పత్రికా స్వేచ్ఛకు భంగకరమని, రాజ్యాంగం భరోసా ఇచ్చిన సమాచార హక్కునూ కాలరాస్తోందని నేపాల్ పాత్రికేయుల సమాఖ్య విమర్శించింది. ఖాట్మండూలోని నడిబొడ్డున మైతీఘర్ మండల పాత్రికేయులు నిరసన పాటించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య డిజిటల్ నేపాల్ పతనాన్ని సూచిస్తుందని కంప్యూటర్ అసోసియేషన్ ఆప్ నేపాల్ (సిఎఎన్) సునైనా ఘిమిరే విమర్శించారు. సమస్య పరిష్కారానికి భాగస్వాములతో చర్చలు అవసరమని సూచించారు. రాజకీయ నాయకులు, ప్రముఖుల పిల్లలు అవినీతితో సంపాదించిన ధనంతో అన్ని సౌకర్యాలు పొందుతున్నారని ఆరోపిస్తూ యువతో ఒక వర్గం నెపో కిడ్ అనే ఆందోళన చేపట్టింది. వారు కూడా ఈ ఆందోళనల్లో పాలుపంచుకుంటున్నారు.