Tuesday, September 9, 2025

బిజెపి ఉపాధ్యక్షులుగా 8మందికి ఛాన్స్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సోమవారం రాష్ట్ర కమిటీని ప్రకటించారు. అందరి ఊహలను పటాపంచలు చేస్తూ రాష్ట్ర కమిటీలో తనదైన ముద్ర వేసుకున్నారు. కొత్త కమిటీలో ఉపాధ్యక్షులుగా డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు యాదవ్, బండారి శాంతి కుమార్, ఎం. జయశ్రీ, కొల్లి మాధవి, డాక్టర్ జె. గోపి (కళ్యాణ్ నాయక్), రఘునాథ్ రావు, బండ కార్తిక రెడ్డిలకు చోటు ద క్కింది. ప్రధాన కార్యదర్శులుగా డాక్టర్ ఎన్. గౌతం రావు, టి. వీరేందర్ గౌడ్, వేముల అశోక్‌లను నియమించారు. కార్యదర్శులుగా డా. ఒ. శ్రీనివాస్ రెడ్డి, కొప్పు భాష, భరత్ పర్‌షాద్, బండారు విజయలక్ష్మి, స్రవంతిరెడ్డి, కరణం పరిణిత, బద్దం మహిపాల్ రెడ్డి, డాక్టర్ తూటుపల్లి రవి కుమార్, కోశాధికారిగా దేవికి వాసుదేవ్, సంయుక్త కోశాధికారిగా విజయ్ సురాన జైన్, ముఖ్య అధికార ప్రతినిధిగా ఎన్‌వి సుభాష్‌ను నియమించారు.మహిళా మోర్చా అధ్యక్షురాలిగా డాక్టర్ మేకల శిల్పారెడ్డిని నియమించారు. యువ మోర్చా అధ్యక్షునిగా గణేష్ కుండె, కిసాన్ మోర్చా అధ్యక్షునిగా బస్వాపురం లక్ష్మీనర్సయ్య, ఎస్‌సి మోర్చా అధ్యక్షునిగా క్రాంతి కిరణ్, ఎస్‌టి మోర్చా అధ్యక్షునిగా నేనావత్ రవి నాయక్, ఒబిసి మోర్చా అధ్యక్షునిగా గంధమల్ల ఆనంద్ గౌడ్, మైనారిటీ మోర్చా అధ్యక్షునిగా సర్దార్ జగ్‌మోహన్ సింగ్‌ను నియమించారు.

దత్తాత్రేయ కుమార్తెకు కార్యదర్శి పదవి
ఇదిలాఉండగా రాంచందర్ రావు తన కార్యవర్గంలో బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మికి కార్యదర్శిగా అవకాశం కల్పించారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సూచించిన బండ కార్తిక రెడ్డికి ఉపాధ్యక్షురాలిగా చోటు కల్పించారు. ఇంకా మరి కొందరికీ అవకాశం కల్పించినట్లు సమాచారం. మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచన మేరకు టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ హోం మంత్రి టి. దేవేందర్ గౌడ్ తనయుడు టి. వీరేందర్ గౌడ్‌కు ప్రధాన కార్యదర్శిగా స్థానం కల్పించారు.

బిసిలకు పెద్ద పీట..
పార్టీ రాష్ట్ర కమిటీ కూర్పుకు రాంచందర్ రావుకు చాలా సమయం పట్టింది. పార్టీ కమిటీలో నూతన రక్తం తీసుకుని వచ్చేందుకు ఆయన శ్రమించారు. అదేవిధంగా విద్యావంతులకు, వెనుకబడిన వర్గాలకు పెద్ద పీట వేశారు. మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్, వీరేందర్ గౌడ్, కాసం వెంకటేశ్వర్లు, బండరు విజయలక్ష్మి తదితరులకు కీలక పదవులు అప్పగించారు. కార్యవర్గం కూర్పులో అన్ని వర్గాలకూ ప్రాధాన్యం ఇచ్చారు. కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్లు సూచించిన వారికీ ఆయన పదవులు కట్టబెట్టారు. అయితే పాత కమిటీలో చాలా మందిని తొలగించడంతో కొంత మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. పాత కమిటీలో ప్రధాన కార్యదర్శులుగా ఉన్న బంగారు శృతి,

జి. ప్రేమేందర్ రెడ్డికి కమిటీలో చోటు దక్కలేదు. కార్యదర్శిగా ఉన్న డాక్టర్ ప్రకాశ్ రెడ్డికి ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి దక్కుతుందన్న అందరి అంచనాలు తలకిందులయ్యాయి. అయితే వారి సేవలను మరో రూపంలో వినియోగించుకోవాలని రాంచందర్ రావు భావిస్తున్నారని పార్టీ నాయకులు అంటున్నారు. ఏదైనప్పటికీ తనదైన ముద్ర ఉండాలన్న భావనతో రాంచందర్ రావు సోమవారం రాష్ట్ర కమిటీని ప్రకటించినట్లు స్పష్టం అవుతున్నది. కమిటీ చాలా బాగుందని పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు, నిజామాబాద్ జిల్లా పార్టీ ఇన్‌ఛార్జి వెంకట రమణి తెలిపారు. చురుకైన వారికి, ముఖ్యంగా విద్యావంతులకు, బిసిలకు పెద్ద పీట వేశారని ఆయన అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News