Tuesday, September 9, 2025

తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే సినిమా

- Advertisement -
- Advertisement -

శుక్ర, మాటరాని మౌనమిది వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు పూర్వాజ్ రూపొందిస్తున్న కొత్త సినిమా ‘ఏ మాస్టర్ పీస్‘. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వజ్, మనీష్ గిలాడ, అషు రెడ్డి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ, ప్రజయ్ కామత్ నిర్మిస్తున్నారు. ‘ఏ మాస్టర్ పీస్‘ సినిమా ఒక కొత్త కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ అనుభూతిని తెలుగు ప్రేక్షకులకు అందించబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. క్లైమాక్స్ సీన్స్ రూపొందిస్తున్నారు. సోమవారం ‘ఏ మాస్టర్ పీస్‘ షూటింగ్ కవరేజ్‌కు మీడియా మిత్రులను ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో దర్శకుడు పూర్వాజ్ మాట్లాడుతూ.. “మనీష్ గిలాడ ఈ చిత్రంలో సూపర్ విలన్‌గా నటిస్తున్నారు. అరవింద్ కృష్ణ ‘ఏ మాస్టర్ పీస్‘ చిత్రంలో సూపర్ హీరోగా కనిపిస్తారు. ఈ చిత్ర కథను మన పురాణా ఇతిహాసాల నుంచి స్ఫూర్తి పొంది తయారుచేశాను” అని అన్నారు. హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ.. ఏ మాస్టర్ పీస్ సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేలా రూపొందుతోందని తెలియజేశారు. ప్రొడ్యూసర్ శ్రీకాంత్ కండ్రేగుల మాట్లాడుతూ హాలీవుడ్ లో కూడా ఉపయోగించని టెక్నాలజీని మా సినిమాకు వాడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్ విలన్, ప్రొడ్యూసర్ మనీష్ గిలాడ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ యోగి పోసాని, హీరోయిన్ జ్యోతి పూర్వాజ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News