Tuesday, September 9, 2025

డబుల్ డెక్కర్ బస్సును రైలు ఢీకొనడంతో 10 మంది మృతి

- Advertisement -
- Advertisement -

మెక్సికో: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డబుల్ డెక్కర్ బస్సును రైలు ఢీకొనడంతో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 45 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం అట్లాకో నగరంలో జరిగింది. మెక్సికో నగరం వ్యాప్తంగా ఇది తీవ్ర భయాందోళనకు గురి చేసింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే సోషల్ మీడియా వేదికగా ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతూ ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News