న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. మంగళవారం ఉదయం పార్లమెంట్ హౌస్ లో ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తొలి ఓటు వేశారు. పార్లమెంట్ ఉభయసభల సభ్యులు ఎంపిలతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఈ ఎన్నిక జరుగుతుంది. ఎంపిలు తమ ఓట్ల ను పార్లమెంట్ హౌస్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశారు.
కౌంటింగ్ ఆరు గంటలకు ప్రారంభమవుతుంది. ఫలితం సాయంత్రం దాటిన తరువాత ఎప్పుడైనా ప్రకటిస్తారు. అధికార ఎన్డీయే నుంచి సీపీ రాధాకృష్ణన్ పోటీలో ఉండగా.. ఇండియా కూటమి నుంచి బి.సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ఎన్నికలో మొత్తం 770 మంది ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీంతో మెజారిటీకి కావాల్సింది 386 ఓట్లు. అయితే, అధికార ఎన్‌డిఎ గెలిచేందుకు అవసరం అయిన మెజార్టీ ఉంది. బిఆర్ఎస్ ఈ ఎన్నికకు దూరంగా ఉంది.
Also Read: సినీ ప్రముఖులకు బెదిరింపులు.. ఎక్సైజ్ కానిస్టేబుల్ అరెస్ట్