- Advertisement -
అమరావతి: అభివృద్ధి, సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ ఎపి చంద్రబాబు నాయుడు అని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ సందర్భంగా పయ్యావుల మీడియాతో మాట్లాడుతూ..రాయలసీమ ప్రాంతంలో వైసిపి పూర్తిగా పట్టు కోల్పోయిందని, వైసిపికి రాయలసీమ ప్రాంతంలో ఉనికి కూడా లేదని విమర్శించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్, చంద్రబాబు, బాలకృష్ణ రాయలసీమ నుంచి ప్రాతినిధ్యమే అని తెలియజేశారు. టిడిపికి పట్టు ఉన్న రాయలసీమలో మరింత పట్టుబిగించేలా సభ జరుగుతోందని, సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
Also Read : ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభం..
- Advertisement -