హైదరాబాద్: ఉన్నతమైన ఆశయాలతో అడుగువేయాలని ఆలోచిస్తున్నామని మాజి ఎమ్మెల్సి కవిత తెలిపారు. ఉన్నతమైన లక్ష్యం దిశగా సంప్రదింపులు జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో కాళోజీ జయంతి కార్యక్రమం నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి, రేపు చాకలి ఐలమ్మ వర్థంతి సందర్భంగా కవిత నివాళులు అర్పించారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సామాజిక తెలంగాణ సాధన కోసం అందరినీ కలుపుకుని పోతామని, కాళోజీ స్ఫూర్తితోనే అందరమూ పనిచేస్తామని తెలియజేశారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో అందరూ విజృంభించి అన్యాయాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని కవిత పేర్కొన్నారు. కాళేశ్వరం కూలిపోయిందని సిఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ జలాలతో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని అన్నారు. రాజ్యాంగం పట్ల జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అంకితభావం ఉందని, ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే పదవికి వన్నె తెస్తారని కవిత స్పష్టం చేశారు.
Also Read : మల్లన్నసాగర్ కాదు.. ఎల్లంపల్లి నుంచి