పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ కొద్దిరోజుల ‘హరిహర వీరమల్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమా ఊహించినంత సక్సెస్ సాధించలేదు. దీంతో పవన్ ఫ్యాన్స్ అందరూ రిలీజ్‌కి సిద్ధంగా ఉన్న ‘ఒజి’ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా నుంచి ఇప్పటివరకూ వచ్చిన అప్‌డేట్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. పవన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసి బర్త్‌డే స్పెషల్ వీడియో ఇంకో లెవల్‌కి తీసుకెళ్లింది. అయితే సినిమా కోసం హీరో పవన్, దర్శకుడు సుజిత్ ఎంత కష్టపడ్డారో. ఈ సినిమాల మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.తమన్ (Thaman OG) అంతే కష్టపడుతున్నాడు.
‘ఒజి’ కోసం లండన్‌లోని ఓ ప్రముఖ మ్యూజిక్ స్టూడియోలో 117 మందితో కలిసి బిజిఎం రికార్డు చేస్తున్నామని తమన్ (Thaman OG) సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. తాజాగా ఈ సినిమా కోసం తన కొత్త ప్రయోగం చేశాడు. ‘ఒజి’లో జపాన్ భాషలో బిజిఎంను తయారు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనున్నారు. సెప్టెంబర్ 25న ఈ సినిమా విడుదల కానుంది.
Also Read : హారర్, మిస్టరీ థ్రిల్లర్ గా ‘కిష్కింధపురి’..