ముంబై: తన మొత్తం వాణిజ్య వాహన శ్రేణిపై ఇటీవలి జీఎస్టీ (GST) తగ్గింపు పూర్తి ప్రయోజనాన్ని వినియోగ దారులకు అందజేయనున్నట్లు భారతదేశ అతిపెద్ద వాణిజ్య వాహన తయారీసంస్థ అయిన టాటా మోటార్స్ ఈరోజు ప్రకటించింది. సవరించిన జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చే తేదీ నుండి అంటే సెప్టెంబర్ 22, 2025 నుండి ఇది అమలులోకి రానుంది. ఈ ప్రకటన చేస్తున్న సందర్భంగా టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ మాట్లాడుతూ.. ‘‘వాణిజ్య వాహనాలపై జీఎస్టీని 18%కి తగ్గించడం భారతదేశ రవాణా, లాజిస్టిక్స్ వెన్నెముకను పునరుజ్జీవింపజేయడానికి సకాలంలో తీసుకున్న ఒక సాహసో పేత చర్య. గౌరవనీయ ప్రధానమంత్రి దార్శనికత, ఆర్థిక మంత్రి నాయకత్వంలో జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించిన ప్రగతిశీల సంస్కరణల నుండి ప్రేరణ పొందిన టాటా మోటార్స్, దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరికీ మా అన్ని వాణిజ్య వాహనాలపై జీఎస్టీ తగ్గింపు పూర్తి ప్రయోజనాన్ని అందించడానికి గర్విస్తోంది. గొప్ప విశ్వాసపు వారసత్వం, భవిష్యత్తు సన్నద్ధక వాహనాలు, మొబిలిటీ ఉత్పత్తుల విస్తృత పోర్ట్‌ఫోలియోతో, భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే వారికి మేం ఎంపిక చేసుకునే భాగస్వామిగా కొనసాగుతున్నాం. వ్యాపార సంస్థలకు సాధికారత అందిస్తాం, మొబిలిటీని శక్తివంతం చేస్తాం, వృద్ధికి ఇంధనంగా ఉంటాం’’ అని అన్నారు.
వాణిజ్య వాహనాలు భారతదేశ ఆర్థిక ఇంజిన్‌కు జీవనాడి. అవి లాజిస్టిక్స్‌కు శక్తినిస్తాయి, వాణిజ్యం జరిగేలా చేస్తాయి, దేశవ్యాప్తం గా కమ్యూనిటీలను అనుసంధానిస్తాయి. మా వాణిజ్య వాహన శ్రేణిలో ధరలను తగ్గించడం ద్వారా రవాణాదారులు, ఫ్లీట్ ఆపరేట ర్లు, చిన్న వ్యాపారాల కోసం మొత్తం యాజమాన్య వ్యయాన్ని మరింత తగ్గించాలని టాటా మోటార్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది అధునాతన, క్లీనర్ మొబిలిటీ ఉత్పత్తులకు ఎక్కువ ప్రాప్యతతో వేగవంతమైన ఫ్లీట్ ఆధునీకరణను ప్రోత్సహిస్తుంది. రవాణా దారులు తమ ఖర్చులను తగ్గించుకోడానికి, కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోడానికి, లాభాలను పెంచుకోడానికి వీలు కల్పిస్తుంది.
టాటా మోటార్స్ వాణిజ్య వాహనాలపై సెప్టెంబర్ 22, 2025 నుండి ధర తగ్గింపులు కింద పేర్కొనబడిన విధంగా అమలులోకి వస్తాయి. రాబోయే పండుగ కాలంలో డెలివరీ కోసం కస్టమర్లు తమకు నచ్చిన వాహనాన్ని ముందుగానే బుక్ చేసుకోవాలని కోరుతున్నా