Wednesday, September 10, 2025

కెతావత్ సోమ్లాల్‌కు జీవిత సాఫల్య పురస్కారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆర్ఎంసిఎస్ ఆర్గనైజేషన్ హైదరాబాద్‌లోని త్యాగరాయ గాన సభలో నిర్వహించిన కార్యక్రమంలో తెలుగుతో పాటు బంజార భాషలలో 500 పాటలను రాసి, అంతటితో ఆగకుండా శ్రీమద్ భగవద్గీత లోని 701 ఒక శ్లోకాలను బంజారాలకు తమ భాషలో అందించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత కెతావత్ సోమ్లాల్‌కు (Kethavath Somlal) జీవిత సాఫల్య పురస్కారం అంధించారు. ఆయన శ్రీ వెంకటేశ్వర ఇతిహాసం, శ్రీ ఆంజనేయ స్వామి ఇతిహాసం, సంత్ శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ ఇతిహాసం, శ్రీ హాతిరాం బావోజి ఇతిహాసం, శ్రీ తుల్జా భవాని ఇతిహాసం, శ్రీ మేరామమాయి ఇతిహాసం, భద్రాచల క్షేత్ర మహత్యం, హింగ్లా భవాని మహాత్మ్యం, భారత్ బంజారా బాపోతి, భారత్ బంజారా గీత్ మాల, తొలి వెలుగుతో పాటు బంజారా తెలుగు పదకోశాన్ని సమాజానికి అందించారు.

ఆదర్శప్రాయమైన అంకితభావంతో పనిచేసి 2024లో పద్మశ్రీ అవార్డుతో తెలంగాణ రాష్ట్రంలోనే కాక మొత్తం దేశంలో గుర్తింపు పొందారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఆకుతోటబావితండ గిరిజన గ్రామంలో కెతావత్ సోమ్లాల్ నాయక్ (Kethavath Somlal) జన్మించారు. అయనకి ప్రతిష్టాత్మక “జీవిత సాఫల్య పురస్కారం” అందుకోవడం ఎంతో సంతోషించే విషయం ఆర్ఎంసిఎస్ ఆర్గనైజేషన్ సభ్యులు అన్నారు. కెతావత్ సోమ్లాల్ నాయక్‌కు ఇప్పుడు జీవితకాల సాఫల్య పురస్కారం అందుకొని తన పుట్టిన ఊరికి, జిల్లాకు, రాష్టానికి, దేశానికి సైతం గొప్ప పేరు తెచ్చారని అభిప్రాయపడ్డారు.

జీవితకాల సాఫల్య పురస్కారాలు ఒక వ్యక్తి యొక్క తన మొత్తం జీవితంలో సాధించిన విశేష కృషికి, నిబద్ధతకు, నైపుణ్యానికి, సమాజానికి చేసిన సేవలను గుర్తించి గౌరవించడానికి ఇవ్వబడతాయని అన్నారు. ఈ పురస్కారాలు వ్యక్తిగత గుర్తింపుతో పాటు వారిని ఇతరులకు ఆదర్శంగా నిలుపడంతో పాటు సామాజిక ఆమోదాన్ని ప్రేరణను అందిస్తుందని పేర్కొన్నారు. పద్మశ్రీ కెతావత్ సోమ్లాల్ నాయక్ చేసిన దశాబ్దాల కృషికి, త్యాగానికి, సేవకు లభించిన అత్యున్నత గౌరవమిది అని తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి సముద్రాలవేణుగోపాల చారి, దైవజ్ఞ శర్మ తోపాటు చాలా మంది కవులు, కళాకారులు హాజరయ్యారు.

Also Read : రేపటి నుంచి కెటిఆర్ జిల్లాల పర్యటన

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News