- Advertisement -
హైదరాబాద్: పసిడి ప్రియులకు ఇది చేదు వార్త. బంగారం కొనాలంటే ఇక మధ్యతరగతి కుటుంబాలు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిందే. ఎందుకంటే బంగారం ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో వరుసగా బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో బంగారం కొనాలనే ఆలోచనే చాలామంది చేయడం లేదు. తాజాగా బంగారం రికార్డు (Gold Rate) సృష్టించింది. 10 గ్రాముల పసిడి మరింత ప్రియమైంది. 10 గ్రాముల బంగారం ధర జీవనకాల గరిష్టానికి చేరుకుంది. మంగళవారం ఒక్కరోజే ఏకంగా 10 గ్రాముల బంగారం ధర రూ.5,080లు పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.1.12 లక్షలకు చేరుకుంది. బంగారం ధర ఈస్థాయికి చేరుకోవడంతో పసిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు.
Also Read : రూ.1.10 లక్షలకు చేరువలో బంగారం ధర
- Advertisement -