Wednesday, September 10, 2025

సిఎం రేవంత్‌రెడ్డి గ్రూప్ 1 పోస్టులను అమ్ముకున్నారు: పాడి కౌశిక్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

గ్రూప్ 1 పోస్టుల కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సిఎం రేవంత్ రెడ్డిపై సిబిఐ విచారణను కోరాలని అన్నారు. సిఎం రేవంత్‌రెడ్డి గ్రూప్ 1 పోస్టులను అమ్ముకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. సిఎంఓ ఆఫీసు నుంచి గ్రూప్1 పోస్టులు అమ్ముకున్నారని చెప్పారు. ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని కోర్టు కూడా చెప్పిందని గుర్తు చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రూప్1 విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అ పేర్కొన్నారు. గ్రూప్1 మెయిన్స్ విషయంలో తప్పులు జరిగాయని హైకోర్టు నమ్మిందని,మెయిన్స్ రీ వాల్యుయేషన్ లేదా రీ ఎగ్జామ్ పెట్టాలని హైకోర్టు చెప్పిందని తెలిపారు.

గ్రూప్ 1లో దేశంలో ఎక్కడా లేని విధంగా స్కామ్ జరిగిందని బిఆర్‌ఎస్ చెప్పిందని తెలిపారు.తాను గ్రూప్ 1పై మాట్లాడితే తనపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు పెట్టారని అన్నారు. బిఆర్‌ఎస్ హయాంలో పేపర్ లీక్ అయితే కెసిఆర్ పరీక్షను రద్దు చేశారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ఎందుకు  గ్రూప్1 మెయిన్స్‌ను రద్దు చేయలేదని అడిగారు. అశోక్ నగర్‌లో నిరుద్యోగ యువతను రాహుల్ గాంధీ,రేవంత్ రెడ్డి రెచ్చగొట్టారని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్,బిజెపి అలయన్స్ నడుస్తోందని ఆరోపించారు. కెసిఆర్ హయాంలో గ్రూప్1 పేపర్ లీక్ అయితే బండి సంజయ్ గగ్గోలు పెట్టారని, ఇప్పుడు గ్రూప్1 మెయిన్స్ పేపర్‌లో అవకతవకలు జరిగితే బండి సంజయ్ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. రేవంత్ రెడ్డి,బండి సంజయ్ మూలాఖత్‌లో నడుస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్టును బిజెపి ఎంఎల్‌ఎ పాల్వాయి హరీష్ చదువుతున్నారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News