Wednesday, September 10, 2025

అల్లు అరవింద్‌కు షాక్ ఇచ్చిన జిహెచ్‌ఎంసి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు (Allu Aravind) జిహెచ్‌ఎంసి షాక్ ఇచ్చింది. ఆయనకు జిహెచ్‌ఎంసి సిబ్బంది షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అల్లు కుటుంబం.. జూబ్లీహిల్స్‌లో ‘అల్లు బిజినెస్ పార్క్‌’ని నిర్మించిన విషయం తెలిసిందే. అయితే ఈ భవనానికి జిహెచ్‌ఎంసి నాలుగు అంతస్తుల వరకే అనుమతి ఇచ్చింది. కానీ, అదనంగా పెంట్ హౌస్‌ను కూడా నిర్మించారు. దీంతో జిహెచ్‌ఎంసి చర్యలకు దిగింది. ఆ భవనంపై అనుమతి లేకుండా నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేయరాదో చెప్పాలని షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. రెండేళ్ల క్రితం నిర్మితమైన ‘అల్లు బిజినెస్ పార్క్’లో గీతా ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

Also Read : ‘ఒజి’ సినిమా కోసం తమన్ సరికొత్త ప్రయోగం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News