Wednesday, September 10, 2025

రీవాల్యూయేషన్.. కుదరకపోతే మళ్లీ పరీక్ష

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు చెప్పింది. ఇప్పటికే నిర్వహించిన ఈ పరీక్షా ప్ర శ్నా పత్రాలను పునః మూల్యాంకనం చేయాల ని అది సాధ్యం కానిపక్షంలో పరీక్షలను తిరిగి నిర్వహించాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఇందుకు గాను ఎనిమిది నెలల గడువును కూడా ధర్మాసనం ఇచ్చింది. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని, తమ ప్రశ్నా పత్రాలను అర్హత లేని వారితో మూల్యాంకనం చే యించారని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై పలు మార్లు విచారించిన హైకోర్టు ధర్మాసనం ఎట్టకేలకు తుది తీర్పును వెలువరించింది. జనరల్ ర్యాంకింగ్స్ జాబితాను రద్దు చేయాలని ఆదేశించింది. సంజయ్ వర్సెస్ యూపిఎస్‌సి కే సులో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి పునఃమూల్యాకనం జరపాలని టి జిపిఎస్‌సిని ఆదేశించింది. గ్రూప్ 1 నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ 18 మంది అభ్యర్థులు ఈ ఏడాది ఏప్రిల్ 15వ తేదీన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు రెండు రోజుల పాటు విచారణ చేపట్టారు. మెయిన్స్ పరీక్ష కేంద్రాల కేటాయింపులో నిబంధనలు పాటించలేదని, జవాబు పత్రాల మూల్యాంకనలంలోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు.

ఒకే కేంద్రంలో ఒక అభ్యర్థి వెనక కూర్చొని పరీక్ష రాసిన మరో అభ్యర్థికి ఒకే విధంగా మార్కులు వచ్చాయని కోర్టు దృష్టికి తీసుకుని వెళ్ళారు. 18 రకాల సబ్జెకులు ఉంటే 12 సబ్జెక్టుల నిపుణులతోనే పేపర్లను దిద్దించారని, మూడూ బాషల్లో పరీక్ష జరిగినా తగిన నిపుణులతో దిద్దించలేదని పిటిషనర్లు తెలిపారు. ఒకే మాధ్యమంలో నిపుణులు అయిన వారితో ఇంగ్లీషు, తెలుగు మీడియం పేపర్లు మూల్యాంకనం చేయించారని, దీంతో మూల్యాంకనంలో నాణ్యత లోపించిందని తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ వాదనను టిసిపిఎస్‌సి తరపు న్యాయవాదులు ఖండించారు. ఒకే కేంద్రంలో పరీక్ష రాసిన ఎక్కువ మందికి అధిక మార్కులు వచ్చాయన్నారు. అభ్యర్థులు కేవలం అపోహ పడుతున్నారని, నిపుణులైన ప్రొఫెసర్ల పర్యవేక్షణలో మూల్యాంకనం జరిగిందని టిజిపిఎస్‌సి కోర్టుకు తెలిపింది. ఈ క్రమంలో ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తుది నియామకాలు చేపట్టోద్దని మధ్యంతర ఉత్తర్వులు జారి చేసింది.

స్టే ఎత్తివేయాలని ఎంపికయిన అభ్యర్థులు పిటిషన్
గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు విధించిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని కోరుతూ గ్రూప్1కు ఎంపికైన నలుగురు అభ్యర్థులు హైకోర్టులో వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. స్టే విధించడంతో ఎంపికయిన అభ్యర్ధులు నష్టపోతున్నారని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు.

టిజిపిఎస్‌సి వాదనలు ఇలా
గ్రూప్1 పరీక్షలపై పిటిషన్ దారులు పేర్కొన్న ఆరోపణల్లో నిజం లేదని టిజిపిఎస్‌సి వాదనలు వినిపించింది. గ్రూప్1 కు ఎంపికయిన తెలుగు మీడియం అభ్యర్థులు 9.95 శాతం, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు 89.88 శాతం, ఉర్దూ మీడియంలో 0.1 శాతంగా ఉన్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఏపిపిఎస్‌సి పరీక్షల్లోనూ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులే అధికంగా ఉన్నారని కోర్టుకు తెలిపారు. టిజిపిఎస్‌సికి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియం అభ్యర్థుల పట్ల ఎలాంటి వివక్ష లేదని వివరించారు. అందరికి నిపుణులు ఎంపిక చేసిన అంశాల ఆధారంగా మార్కులు వేసినట్లు కోర్టుకి తెలిపారు. కోఠిలోని ఓ పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసిన వారే ఎక్కువ మంది ఎంపికయ్యారనేది అవాస్తవమని, అక్కడ ఉన్న రెండు పరీక్షా కేంద్రాలలో 1500 మంది అభ్యర్థులు మెయిన్స్ రాశారన్నారు.

మిగతా పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాసిన వాళ్లలో అంతకంటే ఎక్కువ మందే ఎంపికయినట్లు తెలిపారు. కోఠిలోని రెండు కేంద్రాలను కేవలం మహిళలకు కేటాయించడంతో సౌకర్యాలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నట్లు చెప్పారు. ఉద్యోగానికి ఎంపిక కాని అభ్యర్థులు లేనిపోని అనుమానాలతో పిటిషన్లు దాఖలు చేశారని, వారు చేస్తోన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవని, అవి కేవలం అపోహలు మాత్రమే అన్నారు. పరీక్షలు రాసిన అభ్యర్థుల సంఖ్య విషయంలో ఎలాంటి తేడా లేదన్నారు. నామినల్ రోల్స్, అభ్యర్థుల వేలిముద్రల ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడించినట్లు ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం ఎవాల్యుయేటర్‌కు ఏమైనా మార్గదర్శకాలు ఉన్నాయా అని ప్రశ్నించింది. ఈ క్రమంలో ధర్మాసనం అడిగిన పలు ప్రశ్నలకు సీల్డ్ కవర్‌లో టిజిపిఎస్‌సి సమాధానం ఇచ్చింది. వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వు చేసి మంగళవారం వెల్లడించింది.

డివిజన్ బెంచ్ అప్పీల్‌కు వెళ్లే ఆలోచనలో టిజిపిఎస్‌సి
గ్రూప్ 1 పరీక్షల విషయంలో హైకోర్టు తీర్పుపై టిజిపిఎస్‌సి అప్పీల్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పునఃమూల్యాంకనం చేయాలని సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసేందుకు టిజిపిఎస్‌సి కసరత్తు చేస్తున్న సమాచారం. టిజిపిఎస్‌సి అప్పీల్‌కు వెళితే తాము సైతం వాదనలు వినిపించేందుకు సిద్దంగా ఉన్నట్లు మెయిన్స్ అర్హత సాధించిన అభ్యర్థులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News