సూపర్ హీరో తేజ సజ్జా నటించిన పాన్- ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
అద్భుతమైన ఫాంటసీ అడ్వెంచర్…
నాకు చిన్నప్పుడు చందమామ కథలు, అమర చిత్ర కథలు అంటే చాలా ఇష్టం. ఆ కథలన్నీ కూడా మన రామాయణ, మహాభారత ఇతిహాసాలకి కనెక్ట్‌గా ఉంటాయి. మిరాయ్ కూడా అద్భుతమైన ఫాంటసీ అడ్వెంచర్. చరిత్రతో పాటు ఫిక్షన్ కూడా మిళితమై ఉంది.
ఆ పోరాటం అద్భుతంగా ఉంటుంది…
కార్తీక్ కథ చెప్పగానే చాలా నచ్చింది. అశోకుడు మొత్తం జ్ఞానాన్ని 9 పుస్తకాల్లో నిక్షిప్తం చేశాడు. అందులో వాటి రక్షణ ఎనిమిది మంది యోధులకు ఇస్తాడు. ఒక పుస్తకం మాత్రం ఒక ఆశ్రమానికి ఇస్తాడు. ఆ పుస్తకాల ప్రాధాన్యత ఏమిటి? వాటి గురించి హీరో, విలన్ ఎలాంటి పోరాటం చేశారనేది ఈ సినిమాలో అద్భుతంగా ఉంటుంది.
థాయిలాండ్‌లో ప్రత్యేక శిక్షణ…
ఈ సినిమా కోసం తేజ చాలా హార్డ్ వర్క్ చేశారు. థాయిలాండ్‌లో యాక్షన్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. అలాగే మనోజ్ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. చాలా అనుభవం వున్న నటీనటులు ఇందులో చాలా ముఖ్యమైన పాత్రలు పోషించారు.
ఆ సంకల్పం ఏమిటనేది…
మిరాయ్ ఒక తల్లి సంకల్పంతో ముడిపడిన కథ. ఆ సంకల్పం ఏమిటనేది తెరపై అద్భుతంగా వచ్చింది. ‘మిరాయ్’ అద్భుతమైన ఫాంటసీ విజువల్ వండర్. డైరెక్టర్ కార్తీక్ ఫాంటసీ స్టోరీ టెల్లింగ్, మంచి కనెక్షన్‌తో సినిమాని తీశాడు.
థియేటర్స్‌లో మంచి అనుభూతినిస్తుంది…
బిగ్ కాన్వాస్ ఉన్న సినిమా ఇది. గత ఏడాదిన్నరగా ఈ సినిమాతోనే ఇంకా ఎక్కువగా ప్రయాణిస్తున్నాను. బడ్జెట్ గురించి ఆలోచించకుండా ఎక్కడా రాజీపడకుండా చేసిన సినిమా ఇది. సినిమాలో శ్రీరాముల వారు కనిపించడానికి మంచి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంటుంది. అది థియేటర్స్‌లో మంచి అనుభూతినిస్తుంది.
ప్రభాస్ బర్త్ డేకి ఫస్ట్ సింగిల్…
రాజాసాబ్ సినిమా జనవరి 9న వస్తుంది. కాంతార 2 సినిమాతో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం. ప్రభాస్ బర్త్ డేకి ఫస్ట్ సింగిల్ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాం.
తదుపరి చిత్రాలు…
తెలుసు కదా సినిమా వచ్చే నెల వస్తుంది. తర్వాత మోగ్లీ ఉంటుంది. లావణ్య త్రిపాఠితో ఒక థ్రిల్లర్ చేస్తున్నాం. సునీల్‌తో కూడా ఒక సినిమా చేస్తున్నాం. అవి కూడా ఈ ఏడాదిలోనే వస్తాయి. గూడచారి 2, గరివిడి లక్ష్మి, అలాగే కన్నడలో కొన్ని సినిమాలు చేస్తున్నాం. దాదాపు 12 సినిమాలు 2026,- 2027 మధ్య మా సంస్థ నుంచి విడుదలవుతాయి.