Wednesday, September 10, 2025

పసికూన యుఎఇతో టీమిండియా ఢీ… రాత్రి 8.30 మ్యాచ్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

దుబాయి: ఆసియాకప్ టి20 టోర్నమెంట్‌లో టీమిండియా తన తొలి మ్యా చ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)తో తలపడనుంది. బుధవారం దుబాయి వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఆసియాకప్‌లో భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లు బరిలో ఉన్నా టీమిండియాకే ట్రోఫీ గెలిచే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. గ్రూప్‌బిలో భారత్‌తో పాటు యుఎఇ, పాకిస్థాన్, ఒమన్ జట్లు ఉన్నాయి. యుఎఇతో జరిగే మ్యాచ్‌లో ఘన విజయం సాధించడం ద్వారా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగే పోరుకు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలనే పట్టులతో టీ మిండియా ఉంది. యుఎఇతో పోల్చితే భారత్ చాలా బలంగా ఉందని చెప్పా లి.

Also Read: గిల్‌తో చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకున్న యుఎఇ బౌలర్

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, హా ర్దిక్ పాండ్య, సంజు శాంసన్, అబిషేక్ శర్మ, బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లకు జట్టులో కొదవలేదు. సూర్యకుమార్, గిల్, శాంసన్, అభిషేక్‌లు జట్టుకు చాలా కీలకంగ మారారు. కెప్టెన్ సూర్యకుమార్ జట్టును ముందుండి నడిపించేందుకు సిద్ధమయ్యాడు. గిల్ కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. సంజు శాంసన్ టోర్నీకి ప్రత్యేక ఆకర్షణగా మారాడు. అందరి దృష్టి అతనిపైనే నెలకొంది. ఈ టోర్నమెంట్‌లో రాణించడం ద్వారా రానున్న రోజుల్లో టీమిండియాలో స్థానాన్ని శాశ్వతం చేసుకోవాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. జితేశ్ శర్మ కూడా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు.

సవాల్ వంటిదే..

మరోవైపు యుఎఇకి భారత్‌తో పోరు సవాల్ వంటిదేనని చెప్పాలి. ప్రపంచంలోనే బలమైన జట్టుగా పేరు తెచ్చుకున్న టీమిండియాను ఎదుర్కొవడం యుఎఇకి అనుకున్నంత తేలికేం కాదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ చాలా బలంగా ఉన్న నేపథ్యంలో యుఎఇకి ఇబ్బందులు ఖాయంగా కనిపిస్తున్నాయి. అయితే యుఎఇ టీమ్‌లో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News