Wednesday, September 10, 2025

హాంకాంగ్ పై ఆఫ్ఘాన్ భారీ విజయం

- Advertisement -
- Advertisement -

అబుదాబి: ఆసియా కప్‌లో హాంకాంగ్‌పై ఆప్ఘనిస్థాన్ ఘన విజయం సాధించింది. 94 పరుగులు తేడాతో ఆప్ఘాన్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘాన్ 189 పరుగుల లక్షన్ని హాంకాంగ్ ముందు ఉంచింది. హాంకాంగ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఆఫ్ఘాన్ విజయ దుందుభి మోగించింది. ఆప్ఘాన్ బ్యాట్స్‌మెన్లలో సెదికుల్లా అతల్ 73 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అజమతుల్లా 53 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. నబీ 33 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు సింగిల్ డిజిట్‌కే పరమితమయ్యారు. హాంకాంగ్ బ్యాట్స్‌మెన్లలో బాబర్ హయత్(39), యాసిమ్ ముర్తాజా(16) పరుగులు చేయగా మిగిలిన బ్యాట్స్‌మెన్లు ఘోరంగా విఫలం కావడంతో భారీ ఓటమిని చవిచూశారు. ఈ మ్యాచ్‌లో ఆఫాన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఓమర్ జాయ్ 53 పరుగులు చేయడంతో ఒక వికెట్ తీయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News