Wednesday, September 10, 2025

దళిత ద్రోహి కెసిఆర్: బిర్లా

- Advertisement -
- Advertisement -

మిగులు రాష్ట్రాన్ని పది ఏళ్లలో పందికొక్కులా దోచుకొన్నారు

అప్పుల రాష్ట్రానికి సిఎం అయిన రేవంత్ రెడ్డి సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఆపలేదు

కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్ద పీట

వర్టూర్ దళితవాడ పల్లె నిద్ర లో ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య

మన తెలంగాణ / మోటకొండూరు : మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ దళితులకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చకుండా దళిత ద్రోహి అయ్యారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఆరోపించారు. మంగళవారం మండలంలోనీ వర్టూరు గ్రామంలో రాత్రి దళిత వాడలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమ సమయంలో వర్టూర్ గ్రామంలో దళితవాడలో కెసిఆర్ పల్లె నిద్ర చేశారని గుర్తు చేశారు. నిద్ర చేసిన కుటుంబంతో పాటు అక్కడ ఉన్న 60 దళిత కుటుంబాలకు 60 డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇంటికొక బర్రె, ఐదు వేల రూపాయల నగదు ఇస్తామని హామీలను విస్మరించి కెసిఆర్ దళిత ద్రోహి అయ్యారని మండిపడ్డారు. కెసిఆర్ నిద్రించిన ఇంటిలోనే విప్ బిర్లా ఐలయ్య పల్లె నిద్ర చేశారు. వారు హామీ ఇచ్చి మాట తప్పితే మేము హామీ ఇవ్వకుండానే వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలియజేశారు. ఆ కుటుంబంలో ఆడబిడ్డ వెన్నల ఉన్నత చదువు కోసం సహకారం అందిస్తానని కెసిఆర్ చెప్పి మాట తప్పారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి తో మాట్లాడి వెన్నలకు ఉద్యోగం ఇప్పిస్తానని ఐలయ్య హామీ ఇచ్చారు.

Beerla Ilaiah comments KCR

మిగులు తెలంగాణ రాష్ట్రాన్ని పది ఏళ్లలో పందికొక్కుల దోచుకొన్నారని మండిపడ్డారు. అప్పుల తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఆపలేదని అన్నారు. ఆర్ టి సి బస్ లకు, పెట్రోల్ బంకులు యజమానులను చేసిన ఘనత మా ప్రభుత్వనికే దక్కుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్ద పీట వేయడం జరిగింది అని అన్నారు. అనంతరం మహిళలతో కలిసి బిర్లా సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఐనాల చైతన్య మహేందర్ రెడ్డి, ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈరసరపు యాదగిరి గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పచ్చిమట్ల మదార్ గౌడ్, మండల అధ్యక్షులు మల్లేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కరుని రఘునాథ రాజు, నెమ్మని సుబ్రమణ్యం, తండ పాండురంగంగౌడ్, కంకల ఏలేందర్, మొర శ్రీనివాస్ రెడ్డి, మధు, నర్సింగరావు, రామకృష్ణ, ఉదయ్, మల్లేష్, కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.

Also Read: జూబ్లీహిల్స్ అభ్యర్థి దానం?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News