- Advertisement -
హైదరాబాద్: పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు చోట్ల చైన్ స్నాచింగ్ జరిగింది. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు కెవి రెడ్డి నగర్ లో వాకింగ్ చేస్తున్న బాలమణి మేడలో నుంచి ఐదు తులాల చైన్ లాక్కొని పారిపోయారు. మరో ఘటనలో ఎన్ సి ఎల్ కాలనీలో బస్సు కోసం బస్ స్టాప్ లో వేచి ఉన్న ఓ యువతీ మెడలో చైన్ స్నాచింగ్ కు యత్నించారు. గొలుసు తెగిపోవడంతో అక్కడి నుంచి స్నాచర్ పారిపోయాడు. గంట వ్యవధిలో ఒకే పోలీస్ స్టేషన్ పరిధిలో స్నాచర్లు హల్ చల్ చేయడంతో పోలీసులు అలెర్టయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: జూబ్లీహిల్స్ అభ్యర్థి దానం?
- Advertisement -