Wednesday, September 10, 2025

బుమ్రాను ఆడిస్తే ఊరుకొనేదిలేదు.. మాజీ క్రికెటర్ వార్నింగ్

- Advertisement -
- Advertisement -

ఆసియాకప్-2025లో టీం ఇండియా తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతోంది. తొలి పోరులో పసికూన యుఎఇతో భారత్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో తలపడే జట్టు కూర్పుపై కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లు కసరత్తు చేస్తున్నారు. ఎవరిని ఆడించాలి, ఎవరిని పక్కన పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఈ మ్యాచ్‌లో ఆడిస్తే ఊరుకొనేది లేదని టీం ఇండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా (Ajay Jadeja) హెచ్చరించారు. బుమ్రాను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ బుమ్రాను ఈ మ్యాచ్‌లో ఆడిస్తే స్ట్రైక్ చేస్తానని అన్నారు.

‘‘ఈ మ్యాచ్‌లో బుమ్రాను ఆడించాల్సిన అవసరం ఏముంది? అతడిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. యుఎఇపై బుమ్రా అవసరమా? ఒకవేళ మనం అతడిని రక్షించకపోతే ఇంకెందుకు? అయితే నేను యుఎఇని తక్కువ చేసి మాట్లాడటం లేదు.. అగౌరవపరచడం లేదు. ఆ జట్టు సారథిని చూశా. చాలా టాలెంటెడ్. కానీ, ఇతర జట్ల స్థాయి గురించి మాట్లాడటం లేదు. టీం ఇండియా టి-20 విన్నింగ్ జట్టు. యుఎఇతో బుమ్రాను ఆడిస్తే నేను స్ట్రైక్ చేస్తా. ఆ విషయంలో నేను పూర్తి స్పష్టతతో ఉన్నా’’ అని అజయ్ జడేజా (Ajay Jadeja) తన అభిప్రాయాన్ని తెలిపారు.

Also Read : వివాదాస్పద కేసులో.. పృథ్వీషాకు జరిమానా విధించిన కోర్టు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News