Thursday, September 11, 2025

అణచివేతపై ధిక్కార పతాక చాకలి ఐలమ్మ : సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

అణచివేత..దమనకాండలపై ఎగురవేసిన ధిక్కార పతాక చాకలి ఐలమ్మ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సీఎం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ గడ్డపై దొరల అహంకారానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా 80 ఏళ్ల క్రితమే జంగ్ సైరన్ మోగించిన యోధురాలు ఐలమ్మ అని అన్నారు. సమ్మక్క.. సారక్క..చాకలి ఐలమ్మల స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీలు పోరిక బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News