Thursday, September 11, 2025

చెలరేగిన భారత బౌలర్లు.. 57 పరుగులకే కుప్పకూలిన యుఎఇ

- Advertisement -
- Advertisement -

దుబాయ్: ఆసియా కప్ 2025లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా భారత బౌలర్లు చెలరేగడంతో (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)యుఎఇ జట్టు కేవలం 57 పరుగులకే కుప్పకూలింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన యుఎఇ బ్యాట్స్ మెన్లలో ఓపెనర్లు అలీషన్‌(22), మహ్మద్‌ వసీమ్‌(19)లు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు.మిగతా అందరూ సింగల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. దీంతో టీమిండియా ముందు యుఎఇ 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లో కుల్దీప్ యాదవ్ నాలుగు, శివమ్ దూబే మూడు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News