- Advertisement -
ఉప రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ నేతృత్వంలోని ‘ఇండి’ కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఓడిపోయినా, నైతిక విజయం తమదేనని కాంగ్రెస్ ఎంపి డాక్టర్ మల్లు రవి తెలిపారు. తాము ఎంతో సమన్వయంతో ఎన్నికల పోరాటం చేశామని ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో అన్నారు. సైద్ధాంతికంగా ఇండి కూటమిదే విజయమని ఆయన తెలిపారు.ఎంపి చామల కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేసే విషయంలో ఇండి కూటమిలోని భాగస్వామ్యపక్షాలు తమ ఐక్యతను చాటాయని ఆయన తెలిపారు. ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్‌ను ఆయన అభినందించారు.
- Advertisement -