Thursday, September 11, 2025

పిడుగుపాటుకు ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా పిడుగు పాటుకు ఏడుగురు మృతి చెందారు. నిర్మల్ జిల్లాల్లో ఇద్దరు దంపతులతో పాటు ఒక వ్యక్తి మృతి చెందగా, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ముగ్గురు కూలీలు మృత్యువాతపడ్డారు. ఖమ్మం జిల్లాల్లో ఒక్కరు పిడుగు పాటుకు బలయ్యారు. నిర్మల్ జిల్లా పెంబి మండలం గుమ్మేన ఏంగ్లాపూర్ గ్రామానికి చెందిన దంపతులు అల్లేపు ఎల్లయ్య, ఆల్లేపు ఏళ్లవ్వతో పాటు బండారు వెంకటిలు గ్రామ సమీపంలో వ్యవసాయ పనులకు వెళ్లారు తిరిగి వస్తున్న క్రమంలో పిడుగు పడటంతో అక్కడిక్కడే మృతి చెందారు. జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజ మండలం భూంపురం గ్రామంలో పిడుగుపాటుకు ఐదుగురు గాయపడ్డారు. మండలంలోని మేడికొండ, భూంపురం గ్రామాల మధ్య ఆంజేయులు అనే రైతుకు చెందిన పత్తి చేనులో కూలీ పనిచేసేందుకు పలువురు కూలీలు వెళ్ళారు.

Also Read: డైవర్షన్ పాలిటిక్స్ మానండి:హరీశ్‌రావు

సాయంత్రం ఉరుములు, మెరుపులతో చిన్నపాటి వర్షం కురిసింది. దీంతో కూలీలు సమీపంలోని చెట్టుకిందకు వెళ్లారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా చెట్టుపై పిడుగు పడటంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా భూంపురం గ్రామానికి చెందిన పార్వతమ్మ(22), సర్వేష్ (20), సౌభాగ్యమ్మ(40)లు మృతి చెందగా, ఇద్దరు గాయాలపాలయ్యారు. ఉదయం సంతోషంగా కూలీ పనులకు వెళ్లిన వారు సాయంత్రం విగత జీవులుగా మారడంతో ఆయా గ్రామల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని సత్యనారాయణ పురం గ్రామానికి చెందిన చిన్న మహేష్ పిడుగుపాటుకు గురై మృతి చెందాడు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News