Thursday, September 11, 2025

నేడు ఉత్తరాఖండ్‌లో ప్రధాని మోడీ పర్యటన

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్ : ప్రధాని నరేంద్రమోడీ ఉత్తరాఖండ్‌లో గురువారం పర్యటించనున్నారు. ఉత్తరాఖండ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేయనున్నారు. అనంతరం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఆ రాష్ట్రంలో పరిస్థితి తెలుసుకుంటారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ జోలీ గ్రాంట్ ఎయిర్‌పోర్టు దగ్గర ఏర్పాట్లను పరిశీలించారు. ఇటీవల ఉత్తరాదితోపాటు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, తదితర రాష్ట్రాల్లో వరదలు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఆయా రాష్ట్రాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News