Thursday, September 11, 2025

భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలి: అనిల్

- Advertisement -
- Advertisement -

తిరుమల: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత సేవా దృక్పధంతో, మరింత బాధ్యతగా సేవలు అందించాలని నూతనంగా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నతాధికారులకు దశ దిశ నిర్దేశించారు. తిరుమల శ్రీ అన్నమయ్య భవన్ లోని సమావేశ మందిరంలో బుధవారం ఉన్నతాధికారులతో పరిచయ కార్యక్రమం, సమీక్షసమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇఒ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడారు. శ్రీవారి వార్షిక  బ్రహ్మోత్సవాలు కేవలం 2 వారాలు మాత్రమే ఉన్నాయని, గడువు లోపుగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  సూచనల మేరకు శ్రీవారి సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. శ్రీవారి ఆలయ పవిత్రతనుకాపాడుకుంటూ, భక్తులకు ఇంకా ఎలాంటి మెరుగైన సేవలు అందించాలో ముఖ్యమంత్రిగారు సూచించారన్నారు. అదేవిదంగా, టిటిడి చైర్మెన్ వచ్చే ఫీడ్ బ్యాక్, బోర్డు మెంబర్స్, డయల్ యువర్ ఈవో, ఐవిఆర్ఎస్, వాట్సాప్ ద్వారా అభిప్రాయ సేకరణ, సర్వే తదితర మార్గాల ద్వారా ఎప్పటికప్పుడు భక్తులను అభిప్రాయ సేకరణ తీసుకుని ఇంకా మెరుగైన సేవలను అందించే అంశంపై దృష్టి పెట్టాలని కోరారు. అదేవిధంగా, వీలైనంత వరకు ఆధునిక టెక్నాలజీ సాయంతో మరింత మెరుగైన సేవలు అందించే అంశంపై దృష్టి పెట్టాలన్నారు. టిటిడిలో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దన్నారు.

ఉదయం కాలినడకన తిరుమల వస్తుంటే చాలా మంది భక్తులు టిటిడిలో అందుతున్న సేవలపై సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. అలాగే, భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలుచాలా రుచికరంగా, నాణ్యంగా ఉన్నట్లు భక్తులు చెప్పారన్నారు.  తక్షణం చేపట్టే అభివృద్ధి పనులు, దీర్ఘకాలికంగా చేపట్టనున్న పనులపై కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. భక్తులకు అందించేసేవలతోపాటు, విధానపరమైన నిర్ణయాలలో టిటిడి ఉన్నతాధికారులు, ఉద్యోగులు సమిష్టిగా నిర్ణయం తీసుకుని భక్తులకు వేగంగా, నాణ్యంగా సేవలు అందిద్దామన్నారు.

ఈ సందర్భంగా అదనపు ఇఒ సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడారు. తిరుమలలో వసతి, అన్నప్రసాదాలు, డొనేషన్ తదితర శాఖలలో విధానపరమైన  వ్యవస్థలను తీసుకువచ్చామని, దశలవారీగా టిటిడిలోని అన్ని శాఖలలో ఇదే విధానాన్ని తీసుకువచ్చి వ్యవస్థలను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు టిటిడి ఇఒకు నివేదించారు.

టిటిడి జెఇఒ వి. వీరబ్రహ్మం మాట్లాడుతూ, స్థానిక ఆలయాలలో మరింతగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. హింధూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారాసనాతన ధర్మ ప్రచారాన్ని విస్తృతం చేసేందుకు పలు కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. టిటిడి స్థానిక ఆలయాలను 14 జోన్ లుగా విభజించి, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకుకార్యాచరణ చేపట్టామన్నారు.

Also Read: హిమాలయాల్లోని సన్యాసిగా కనిపిస్తా

టిటిడి సివిఎస్వో మురళీకృష్ణ మాట్లాడుతూ, అలిపిరి టోల్ గేట్ వద్ద ఆధునికరించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. భక్తులు మోసాలకు గురికాకుండా ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నామని, అదే సమయంలో  సైబర్ ల్యాబ్ ను  అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. మొదటగా ఉన్నతాధికారులు అందరూ తమ శాఖలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను టిటిడి ఇఒకు వివరించారు. ఈ కార్యక్రమంలో టిటిడిలోని పలు శాఖలకు చెందిన పలువురు  ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News