Thursday, September 11, 2025

ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ సైకోయిజం మారలేదు: గొట్టిపాటి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రజల స్పందన చూసి వైసిపి జగన్ మోహన్ రెడ్డికు అసహనం పెరిగిపోయిందని ఎపి మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. సూపర్ 6 సూపర్ హిట్ సభకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలికారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనంతపురం సభతో వైసిపి దుకాణం పూర్తిగా మూతపడినట్లేనని, ప్రజలు బుద్ధి చెప్పినా తన సైకోయిజం మారలేదని జగన్ నిరూపించారని విమర్శించారు. జగన్ మళ్లీ అధికారం లోకి రావడం కల్లేనని, యూరియా కొరతపై రైతు పోరు అంటూ వైసిపి హడావిడి చేసిందని మండిపడ్డారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఒక్క పనీ చేయలేదని, ఎవరైనా చేసినా ఓర్వలేరని గొట్టిపాటి ఎద్దేవా చేశారు. అధికారం అడ్డం పెట్టుకుని అక్రమ దోపిడీ చేయాలన్నదే జగన్ లక్ష్యం అని దుయ్యబట్టారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందివ్వాలన్నదే ఎపి చంద్రబాబు నాయుడు ధ్యేయం అని గొట్టిపాటి రవికుమార్ తెలియజేశారు.

Also Read : రేపు ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News